పవన్ కళ్యాణ్ ‘జనసేన’ పార్టీని స్థాపించి సుమారు 6 ఏళ్లు కావస్తోంది. 2014 లో పవన్ ఈ పార్టీని స్థాపించాడు. 2019 ఎన్నికల్లో పోటీ చెయ్యగా దారుణంగా ఓడిపోయాడు. అలా అని వెనుకడుగు వేయడం లేదు. సామజిక అంశాల పై స్పందిస్తూ… పోరాడుతూ పార్టీని బలోపేతం చేసే పనిలోనే ఉన్నాడు. ఇక ఎన్నికలకి చాలా టైం ఉంది కాబట్టి… సినిమాల పై కూడా దృష్టి పెట్టాడు. ఇప్పటికే ‘పింక్’ రీమేక్ అయిన ‘వకీల్ సాబ్’ లో నటిస్తున్న పవన్ కళ్యాణ్ మరో రెండు చిత్రాల్లో కూడా చేస్తున్నట్టు ప్రకటించాడు.
నిజానికి ఈ మే నెలలోనే ‘వకీల్ సాబ్’ చిత్రాన్ని విడుదల చెయ్యాలని నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేసాడు కానీ ఇప్పుడు థియేటర్లు మూతపడటంతో వర్కౌట్ కావడం లేదు. ఇక పవన్ సినిమాల గురించి నాగబాబు స్పందించి షాకింగ్ నిజాలు చెప్పుకొచ్చారు..”పింక్ సినిమా రీమేక్ చెయ్యాలని ఉంది అని పవన్ నాకు రెండు, మూడు సార్లు చెప్పాడు. రెండు భాషలతో పోలిస్తే తెలుగులో మరో 10 శాతం బెటర్మెంట్ చేసారు.
ఇక పవన్ -క్రిష్ మూవీ మొఘలాయుల కాలానికి చెందిన కథ. కోహినూరు వజ్రం చుట్టూ ఈ కథ నడుస్తుంది అని నేను విన్నాను. క్రిష్ చాలా ఇంట్రెస్టింగ్ కథను ఎంచుకుని పవన్ ఫ్యాన్స్ ను ఎక్సైట్ చేసేలా తెరకెక్కిస్తున్నాడు అని విన్నాను. కచ్చితంగా ఈ సినిమాలు పవన్ ఫ్యాన్స్ ను అలరిస్తాయి అని అనుకుంటున్నాను. వాళ్లలాగే నేను కూడా ఆ సినిమాల కోసం వెయిట్ చేస్తున్నాను” అంటూ తెలిపారు నాగబాబు.
Most Recommended Video
అత్యధిక టి.ఆర్.పి నమోదు చేసిన సినిమాల లిస్టు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
మన హీరోయిన్ల ఫ్యామిలీస్ సంబంధించి రేర్ పిక్స్!