ఏ నిమిషాన పవన్ కళ్యాణ్ తాను జనసేన పార్టీని స్థాపిస్తున్న తరుణంలో “నేను ఈ పార్టీ పెడుతున్నది అధికారం కోసం కాదు.. ప్రశ్నించడం కోసం” అని డిసైడ్ అయ్యి ఎనౌన్స్ చేశాడో తెలియదు కానీ.. పవన్ కళ్యాణ్ కంటే ఆయన అన్నయ్య నాగబాబు ఈ ప్రశ్నించడాన్ని కాస్త సీరియస్ గా తీసుకొన్నట్లున్నాడు.
గత నాలుగు రోజులుగా బాలకృష్ణను డైరెక్ట్ గా టార్గెట్ చేస్తూ వరుసబెట్టి వీడియోలు చేస్తున్నాడు. ఒక్కో వీడియోలో ఒక్కో సందర్భంలో బాలయ్య నోరుజారి అన్న మాటలను హైలైట్ చేస్తూ అలా ఎందుకు అనాల్సి వచ్చింది అని ప్రశ్నించడం మొదలెట్టాడు నాగబాబు. దాంతో రోజురోజుకూ మెగా మరియు నందమూరి అభిమానుల నడుమ మాత్రమే కాక పోలిటికల్ గానూ భారీ డిస్కషన్స్ కు తెరలేపింది.
అయితే.. బాలయ్యపై నాగబాబు రోజుకో వీడియో వదులుతుండడం అనేది జనసేన కార్యకర్తలకు సంతోషకరమైన విషయమే అయినప్పటికీ.. కొందరు రాజకీయ విశ్లేషకులు మాత్రం ఈ వీడియోలు రాజకీయంగా జనసేనకు మైనస్ గా మారతాయని చెబుతున్నారు. మరి ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ కానీ జనసేన సీనియర్ శ్రేణులు కానీ నాగబాబుకి చెబితే బాగుండు. ప్రస్తుతానికైతే నాగబాబు కౌంటర్స్ అన్నీ ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి.