మెగాస్టార్ చిరంజీవి వేసిన బాటలో ఆయన తమ్ముళ్లు నాగబాబు, కళ్యాణ్ బాబు(పవన్ కళ్యాణ్) లు కూడా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ పెద్ద స్టార్ అవ్వగా.. నాగబాబు మాత్రం హీరోగా నిలదొక్కుకోలేకపోయారు. అయినప్పటికీ నాగబాబు మంచి నటుడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆయన కొన్ని వందల సినిమాల్లో నటించారు. అయితే నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకుందాం అనుకున్న ప్రతీసారి ఆయనకి ఎదురుదెబ్బ తగిలింది. తన అన్నయ్య చిరంజీవిని హీరోగా పెట్టి ఈయన చాలా సినిమాలు నిర్మించారు.
అవి కూడా పెద్ద దర్శకులతోనే..!అయితే ఒక్క ‘బావగారు బాగున్నారా’ మాత్రమే నాగబాబుకి లాభాలను అందించగా మిగిలిన అన్ని సినిమాలు నిరాశపరిచాయి. చిరుతోనే కాదు పవన్ కళ్యాణ్ తో ‘గుడుంబా శంకర్’, రాంచరణ్ తో ‘ఆరెంజ్’, అల్లు అర్జున్ తో ‘నా పేరు సూర్య’ వంటి చిత్రాలు నిర్మించారు. ఇవి కూడా నిరాశపరిచాయి. ముఖ్యంగా ‘ఆరెంజ్’ సినిమా ఈయన్ని పాతాళానికి తొక్కేసిందనే చెప్పాలి. ఆ సినిమాకి గాను నాగబాబు ఆర్ధికంగా చాలా నష్టపోయారు.
అలాంటి టైములో నాగబాబు భార్య పద్మజ.. తన వద్ద ఉన్న నగలన్నీ అమ్మి కొంతవరకు అప్పు తీర్చమని నాగబాబుకి చెప్పిందట.తరువాత ఈ విషయం చిరంజీవి, పవన్ కళ్యాణ్ లకు తెలియడంతో వాళ్ళు తట్టుకోలేక వెంటనే.. నాగబాబు ఇంటికి వచ్చి.. అతని క్రైసిస్ నుండీ బయటకి పడేసినట్టు తెలుస్తుంది. ఇక కొన్నాళ్ళ పాటు నిర్మాణ రంగం వైపు వెళ్లొద్దు అని కూడా పద్మజ గారు నాగబాబు దగ్గర మాట తీసుకున్నారట.
Most Recommended Video
విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!