Naga Chaitanya: యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన నాగ చైతన్య!

సాధారణంగా సినిమా సెలబ్రిటీలు వారి సినిమాలకు సంబంధించిన విషయాలను ప్రమోట్ చేసుకోవాలి అంటే పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నాయి. ఈ క్రమంలోనే సెలబ్రిటీలు ఇంస్టాగ్రామ్ ఫేస్బుక్ ట్విట్టర్ యూట్యూబ్ అంటూ వివిధ రకాలుగా అభిమానులతో ముచ్చటిస్తూ వారికి దగ్గరవుతూ ఉంటారు. ఎప్పటికప్పుడు సినిమాలను ప్రమోట్ చేస్తూ సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇకపోతే నటుడు నాగచైతన్య సోషల్ మీడియాకు కాస్త దూరంగా ఉంటారనే సంగతి మనకు తెలిసిందే.

ఆయన తన సినిమాలను తప్ప మిగతా విషయాల గురించి కూడా పట్టించుకోరు. ఇదిలా ఉండగా తాజాగా నాగచైతన్య అభిమానులకు దగ్గర అవడం కోసం మరో అడుగు ముందుకు వేశారు. ఈ క్రమంలోనే ఈయన నాగచైతన్య పేరిట ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారు. అక్కినేని నాగచైతన్య పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించినటువంటి ఈయన శుక్రవారం ఒక వీడియోని షేర్ చేశారు. అయితే ఇందులో నేటిజన్స్ అడిగిన ప్రశ్నలకు ఈయన సమాధానాలు చెబుతూ వచ్చారు.

ఇందులో భాగంగానే ఒక అభిమాని ప్రశ్నిస్తూ గత కొంతకాలంగా (Naga Chaitanya) నాగచైతన్య గడ్డం జుట్టు పెంచుకొని కనిపిస్తున్నారు అందుకు కారణం ఏంటి అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు నాగచైతన్య సమాధానం చెబుతూ గత ఆరు నెలలుగా తనకు ఎలాంటి పని పాట లేక ఇంట్లో ఖాళీగా కూర్చున్నానని అందుకే గడ్డం జుట్టు పెంచాను అంటూ సరదాగా సమాధానం చెప్పారు.

ఇలా సరదాగా సమాధానం చెప్పినటువంటి నాగచైతన్య అనంతరం చందు మొండేటి దర్శకత్వంలో చేయబోతున్న సినిమా కోసమే తాను ఇలా గడ్డం జుట్టు పెంచాను అంటూ సమాధానం చెప్పారు.

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus