Naga Chaitanya: వదంతులొస్తున్నాయ్‌ నిజమే… కానీ నా దృష్టి వాటిపైనే… : నాగ చైతన్య

నాగచైతన్య రిలేషన్‌ షిప్‌ స్టేటస్‌ ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం ఎవరైనా చెప్పాలి అంటే అది నాగచైతన్య మాత్రమే. అందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఆయన గురించి ఆయనకు తప్ప ఇంకెవరికి తెలుస్తాయి. అయితే సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యే ఫొటోలు, వీడియోలు, వార్తలు చూస్తే చైతు రిలేషన్‌లో ఉన్నాడు అనే అనిపిస్తుంది. చైతన్యతో ఎవరో దిగి షేర్‌ చేసిన ఫొటోలో ఓ యువ కథానాయిక తరచుగా కనిపిస్తూ ఉంటుంది.

దీంతో రిలేషన్‌ షిప్‌ స్టేటస్‌ గురించి చైతు దగ్గర ఇటీవల ప్రస్తావిస్తే ఆసక్తికర సమాధానం వచ్చింది. నాగచైతన్య – సమంత విడిపోయిన తర్వాత… ఇప్పుడు ఎవరి జీవితాలు వారివి. అయితే విడిపోయిన విషయం, తర్వాత జరిగే చర్చల విషయంలో చాలా రకాల చర్చలు, ఉపచర్చలు జరుగుతున్నాయి. ఎవరు, ఏంటి, ఎందుకు, ఎలా, ఎప్పుడు అనే ప్రశ్నలు వినిపించినా.. ఆ చర్చల ప్రస్తావన ఇప్పుడు అనవసరం. అందుకే చైతన్యనే ఆ విషయం అడిగితే…

వ్యక్తిగత జీవితంలో ఏం జరిగినా నేనే స్వయంగా వెల్లడిస్తా. అందులో నాకేం ఇబ్బందేమీ లేదు అని సమాధానం ఇచ్చాడు. అలాగే తన గురించి వచ్చే వదంతుల గురించి కూడా చైతన్య స్పందించాడు. నా గురించి ఎవరేం అనుకున్నా అంటే ఎలాంటి వదంతులు వచ్చినా నేనేం పట్టించుకోను. ప్రస్తుతానికి నా దృష్టంతా సినిమాలపైనే ఉంది అని క్లారిటీ ఇచ్చేశాడు. అయితే రిలేషన్‌ గురించి మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అలాగే తనకు కుదిరినప్పుడల్లా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటాను అని తన ప్లానింగ్‌ గురించి మాట్లాడాడు (Naga chaitanya) నాగచైతన్య.

అయితే అలాంటి అంశాల గురించి చెప్పుకోవడం తనకు పెద్దగా ఇష్టం ఉండదు అని చెప్పాడు. ఇక చైతన్య కొత్త సినిమాల సంగతి చూస్తే… ‘తండేలు’ తర్వాత శివ నిర్వాణ సినిమా చేస్తారని టాక్‌. దీని గురించి చైతన్య దగ్గర అడిగితే… శివ నిర్వాణకు మరో సినిమా చేయాలి. దాని గురించి మాట్లాడుకుంటున్నాం. ప్రస్తుతానికి ఆ కథపైనే దృష్టిపెట్టాను అని చెప్పాడు. అంటే త్వరలో ఈ ప్రాజెక్ట్‌ గురించి అప్‌డేట్‌ రావొచ్చన్నమాట.

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus