నాగచైతన్య – సమంత మధ్య ఏం లేకపోయినా, ఏదో అయిపోతోంది అన్నట్లుగా సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఓ నటితో చైతన్య ప్రేమాయణం అంటూ పుకార్లు వచ్చాయి. మరోవైపు అదే సమయంలో సమంత యువతను ఉద్దేశిస్తూ ఓ ట్వీట్ చేసింది. యువతా మేలుకొండి. మీ కుటుంబం సంగతి చూసుకోండి అని అంది. ఇప్పుడు నాగచైతన్య ‘థ్యాంక్‌యూ’ ప్రచారంలో చెప్పిన మాటను, మిగిలిన విషయాలను లింక్ చేసేస్తున్నారు. ‘థ్యాంక్ యూ’ ప్రచారం కోసం నాగచైతన్య, రాశి ఖన్నా 5 సెకండ్ రూల్ అనే గేమ్ ఆడారు.
అంటే ఏదైనా విషయమ్మీద ఐదు సెకన్లలో సమాధానం చెప్పాలి. అందులో భాగంగా డబుల్ మీనింగ్ గురించి మాట్లాడారు. యాంకర్ ప్రశ్నకు చైతన్య సమాధానమిస్తూ ‘‘నేను ఏ విషయాన్నైనా నేరుగా చెప్తా. అందులో డబుల్ మీనింగ్ ఉండదు’’ అని అన్నాడు చైతన్య. ‘ఆ డబుల్ మీనింగ్ పదాలేంటో నువ్వు చెప్పు.. తెలుసుకుంటా’ అంటూ ఆ హోస్ట్‌నే తిరిగి ప్రశ్నించారు. అలాగే తనకు మంచి హిట్ ఇచ్చిన ‘100 పర్సెంట్ లవ్’ సినిమా నుండి టేక్ ఎవే ఏంటి అని అడిగితే… (a+b)2 ఫార్ములా మాత్రమే గుర్తుంది అని చెప్పాడు నాగచైతన్య.
అలాగే నాగచైతన్యకు ఎంతో ఇష్టమైన కార్ల గురించి హోస్ట్ ఓ ప్రశ్న అడిగారు. దానికి చైతన్య టక్ టక్‌మని సమాధానం చెప్పేశాడు. అయితే కొన్ని విషయాలకు మాత్రం చైతన్య సమాధానాలు చెప్పలేకపోయాడు. ఆ వివరాలు ఈ దిగువ వీడియోలు కూడా చూడొచ్చు. నాగచైతన్య హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘థ్యాంక్ యూ’. రాశీ ఖన్నా ఓ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా జులై 22న విడుదలవుతోంది. దర్శకుడు విక్రమ్ కె. కుమార్ తెరకెక్కించిన చిత్రమిది.
ఇందులో నాగచైతన్య మూడు విభిన్న లుక్స్‌లో కనిపించనున్నాడు. ఈ సినిమాలో మాళవిక నాయర్, అవికా గోర్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. మరోవైపు చైతన్యతో ‘దూత’ అనే వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్నారు విక్రమ్ కె కుమార్.
Most Recommended Video
టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!