Naga Chaitanya: నాగచైతన్య షూటింగ్లో ఉంటే ఆ విషయం గురించి పట్టించుకోరా.. గ్రేట్ అంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని వారసుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నాగచైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటుడిగా ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నటువంటి నాగచైతన్య వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. ఇక సమంతను ప్రేమించి పెళ్లి చేసుకోవడం తనతో విడాకులు తీసుకోవడం ద్వారా పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు. ఇలా సమంతతో నాగచైతన్య విడాకులు తీసుకున్న తర్వాత ఈయన పూర్తిగా తన దృష్టిని సినిమాల పైన పెట్టారు.

ఇక అందరూ హీరోలతో పోలిస్తే నాగచైతన్య సోషల్ మీడియాలో చాలా తక్కువగా కనిపిస్తారు. ఏదైనా స్పెషల్ అకేషన్ ఉన్నప్పుడు లేదా తన సినిమాలు కనుక విడుదల అయితే తప్ప ఈయన సోషల్ మీడియాలో పెద్దగా స్పందించరని చెప్పాలి.కేవలం సోషల్ మీడియాలో అని మాత్రమే కాదు నాగచైతన్య మొబైల్ ఫోన్ కి కూడా చాలా దూరంగా ఉంటారని తెలుస్తుంది. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్క సెలబ్రిటీలు సోషల్ మీడియాలో గంటలు కొద్ది అభిమానులతో ముచ్చటిస్తూ పెద్ద ఎత్తున అభిమానులను సంపాదించుకుంటున్నారు.

అలాగే షూటింగ్ లొకేషన్లో ఏమాత్రం విరామం దొరికిన పెద్ద ఎత్తున మొబైల్ ఫోన్లకు అంకితం అవుతూ ఉంటారు. అయితే నాగచైతన్య మాత్రం షూటింగ్ లొకేషన్లో కనక ఉంటే మొబైల్ ఫోన్ కి చాలా దూరంగా ఉంటారని తెలుస్తుంది. షూటింగ్ సమయంలో తనకు కాస్త విరామం దొరికిన కూడా ఈయన మొబైల్ ఫోన్ మాత్రం అసలు ముట్టుకోరని లొకేషన్ లోకి అడుగు పెట్టగానే మొబైల్ పక్కన పెట్టేస్తారని తెలుస్తుంది.

ప్రస్తుతం ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్ కి అంకితమవుతున్న తరుణంలో (Naga Chaitanya) నాగచైతన్య మాత్రం ఇలా మొబైల్ కి బానిస కాకుండా ఇలా ఫోన్ కు దూరంగా ఉండడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పాలి.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus