టాలీవుడ్ లో అక్కినేని వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన యువ హీరో నాగ చైతన్య…తీసినవి కొన్ని సినిమాలే అయినా…చైతు కి అమ్మాయిల్లో మంచి క్రేజ్ ఉంది. అయితే అదే క్రమంలో అందాల భామ “సమంత”తో ప్రేమ వ్యవహారం నడిపిన చైతు త్వరలోనే ఆమెతో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. అయితే ఇదిలా ఉంటే చైతు ఇప్పుడు ప్రేమమ్ సినిమాలో నటిస్తున్నాడు….త్వరలో ఈ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది…అయితే చైతు లవ్ గురించి అడగడానికి ఎక్కడా చైతు మీడియా ముందుకు రాకపోవడంతో అందరూ చైతు ప్రేమమ్ మూవీ ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారు.
ఆ ప్రమోషన్ కోసం చైతు ఎలానో వస్తాడు కాబట్టి ఈ విషయాలన్నీ అడగాలని మీడియా ఆశగా ఎదురు చూస్తున్న వేళ…చైతు చేత ఆ నిజాలు బయట పెట్టించినట్లే కనిపిస్తుంది యాంకర్ అనసూయ….విషయం ఏమిటంటే…ఈ వీకెండ్ లో ప్రసారం కాబోతున్న ‘డేట్ విత్ అనసూయ’ కార్యక్రమానికి చైతు చీఫ్ గెస్ట్….అదే క్రమంలో ఈ కార్యక్రమంలో అనసూయ చైతన్యతో చాల మాటలు మాట్లాడించబోతోంది అని తెలుస్తుంది….ఇక ఈ కార్యక్రమం ప్రోమో సైతం చాలా ఆసక్తిని రేపుతుంది. అనసూయ తాను ఒగలు పోతూ అడిగే ప్రశ్నలతో చైతన్యను ఎలా ఇరికించింది అన్న ఆసక్తి అందరిలోనూ కలిగే విధంగా ఉంది ఈ ప్రోమో. ఇక ఇప్పటికీ ఈ ప్రోమో హల్చల్ చేస్తుంటే….ఏం జరగబోతుందో అన్న ఆలోచనతో ఉన్నారు మన అక్కినేని ఫ్యాన్స్…..చూద్దాం చైతు ఏం మాట్లాడతాడో.