Naga Chaitanya New House: విడాకుల తర్వాత తన డ్రీమ్ హౌస్ లోకి అడుగుపెట్టిన చైతు!

అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగచైతన్య వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా నాగచైతన్య వరుసగా సినిమాలు చేస్తూ ఉన్నారు. తాజాగా ఈయన వెంకట్ ప్రభు దర్శకత్వంలో నటించిన కస్టడీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే షూటింగ్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 12వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది. ఇలా వరుస సినిమాలు చేస్తూ ఉన్నటువంటి నాగచైతన్య వ్యక్తిగత విషయానికి వస్తే ఈయన నటి సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే.

ఇలా పెళ్లి తర్వాత సమంత నాగచైతన్య నటుడు మురళీమోహన్ ఇంటిని కొనుగోలు చేసి ఆ ఇంట్లోనే నివసించేవారు. అయితే కొంతకాలం పాటు ఎంతో సంతోషంగా ఉన్న ఈ దంపతులు మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్నారు. ఇలా సమంత నాగచైతన్య ఇద్దరు విడాకులు తీసుకోవడంతో ఆ ఇంటిని సమంతకే వదిలిపెట్టిన నాగచైతన్య తిరిగి తన తండ్రి నాగార్జున ఇంటికి వచ్చేసారు. అయితే నాగచైతన్య ఎప్పటినుంచో అందమైన లగ్జరీ మోడ్రన్ హౌస్ నిర్మించుకొని అందులో ఉండాలన్నదే ఆయన డ్రీమ్.

అందుకు అనుగుణంగా నాగార్జున ఇంటికి దగ్గరలోనే స్థలం కొనుగోలు చేసి అన్ని సౌకర్యాలతో అధునాతనమైన టెక్నాలజీతో లగ్జరీ హౌస్ నిర్మించుకున్నట్లు తెలుస్తుంది. ఈ ఇంటిలో స్విమ్మింగ్ పూల్, ప్రత్యేకంగా థియేటర్ అలాగే అన్ని సౌకర్యాలతో నిర్మించారని సమాచారం. ఇలా తన డ్రీమ్ హౌస్ పూర్తి కావడంతో నాగచైతన్య ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా చాలా సింపుల్ గా కొత్త ఇంట్లోకి అడుగు పెట్టినట్టు తెలుస్తుంది.

ఇక నాగార్జున ఇంట్లో కాకుండా నాగచైతన్య ఇకపై ఈ ఇంట్లోనే ఉండబోతున్నారని తెలుస్తుంది. ఇక సమంతతో విడాకులు తీసుకున్నటువంటి నాగచైతన్య ప్రస్తుతం తన ఫోకస్ అంత సినిమాల పైన పెట్టారు. అయితే ఈయన త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతున్నారట తన రెండో పెళ్లి గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నప్పటికీ నాగచైతన్య ఈ విషయంపై ఎక్కడా స్పందించలేదు.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus