తన లవ్ స్టోరీ ని వివరంగా చెప్పిన నాగ చైతన్య

యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య మాటలు వింటుంటే … “ప్రేమంటే ఏమిటంటే పక్కాగా చెప్పమంటే ఎట్టాగ చెప్పేది మామ.. డేటు.. టైమ్ చెప్పకుండానే గుండెల్లో చేరిపోతుంది ఈ ప్రేమ..” అని ఓ సినిమాలోని    పాట గుర్తుకు వస్తుంది. సమంత పై  ప్రేమ ఎలా, ఎప్పుడు పుట్టిందని అని  విలేకరులు అడిగితే చైతూ ఇదే విధంగా చెప్పారు. సరే లవ్ స్టోరీ అయినా చెప్పండంటే ఇలా వివరంగా చెప్పుకొచ్చారు. “మా పరిచయం ఏ మాయ చేసావే చిత్రం అప్పుడు ఏర్పడింది. కష్టసుఖాలు మాట్లాడుకునేవాళ్లం. సినిమాలు హిట్‌ , ఫ్లాప్‌ అయినప్పుడు చర్చించుకునేవాళ్లం. అలా మాకు తెలియకుండానే బెస్ట్‌ ఫ్రెండ్స్‌ అయ్యాం. అలాగే ప్రేమికులుగా మారిపోయాము. ఇంతవరకు ఒకరికొకరం ప్రపోజ్ చేసుకోలేదు.” అంటూ వివరించారు.

అయితే పెళ్లి చేసుకోవాలని ఎప్పుడు అనిపించింది అని విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ “నాకు 30 ఏళ్ళొచ్చాక జీవితం గురించి ఆలోచించడం మొదలుపెట్టా. ఓ వైపు సినిమాలున్నా, నా లైఫ్‌ కూడా కీలకం అనిపించింది. పెళ్లి చేసుకోవాలని అనుకున్నా. ఎంత ఆలోచించినా సమంత తప్ప ఇంకే అమ్మాయీ గుర్తురాలేదు. అప్పుడే నేను కనఫర్మ్‌ చేసుకున్నా. అదే విషయాన్నీ స్పష్టంగా సమంతకు చెప్పాను. ఆమె కూడా ఒప్పుకుంది” అని చైతూ వెల్లడించారు. వచ్చే ఏడాది బంధుమిత్రుల సమక్షంలో వైభవంగా పెళ్లి చేసుకుంటానని స్పష్టం చేశారు. నాగ చైతన్య నటించిన ‘ప్రేమమ్‌’ మూవీ అక్టోబర్‌ 7న విడుదల కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus