టాలీవుడ్ ఇండస్ట్రీలో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉన్న హీరోలలో చైతన్య (Naga Chaitanya) ఒకరు కాగా చైతన్య వాయిస్ కు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. నాగచైతన్య కెరీర్ లో హిట్లు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నా మరీ భారీ బ్లాక్ బస్టర్ హిట్లు అయితే లేవనే సంగతి తెలిసిందే. నితిన్ (Nithiin) రాబిన్ హుడ్ (Robinhood) సినిమా డిసెంబర్ నెల 20వ తేదీన రిలీజ్ కానున్నట్టు ఆ సినిమా మేకర్స్ కన్ఫామ్ చేశారు. క్రిస్మస్ పండుగ కానుకగా ఈ సినిమా విడుదల కానుంది.
అయితే అదే సమయానికి రిలీజ్ కావడానికి మరో సినిమాకు కూడా స్కోప్ అయితే ఉంది. మొదట తండేల్ సినిమాను సైతం డిసెంబర్ నెల 20వ తేదీన రిలీజ్ చేయాలని భావించారు. అయితే గేమ్ ఛేంజర్ (Game Changer) అదే సమయానికి విడుదలవుతుందని భావించి మేకర్స్ వెనక్కు తగ్గడం జరిగింది. తండేల్ సినిమా రిలీజ్ కు సరైన డేట్ కీలకమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు.
ఈ సినిమా బడ్జెట్ ఏకంగా 80 కోట్ల రూపాయలు అని సమాచారం అందుతోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ కు కూడా ఈ సినిమా సక్సెస్ సాధించడం కీలకమనే సంగతి తెలిసిందే. తండేల్ సినిమా నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కింది. సాయిపల్లవి (Sai Pallavi) హీరోయిన్ గా నటించడం ఈ సినిమాకు కొంతమేర ప్లస్ అయిందని చెప్పవచ్చు. క్రిస్మస్ రేసులో నిలిచే సినిమాల జాబితా తెలియాల్సి ఉంది. గేమ్ ఛేంజర్ వాయిదా నేపథ్యంలో తండేల్ మేకర్స్ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.
టాలీవుడ్ ఇండస్ట్రీ సక్సెస్ రేట్ రాబోయే రోజుల్లో ఊహించని స్థాయిలో పెరగాలనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. తండేల్ సినిమా కలెక్షన్ల విషయంలో ఏ స్థాయిలో రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది. డైరెక్టర్ చందూ మొండేటి (Chandoo Mondeti) ఈ సినిమా కోసం ఎంతో కష్టపడుతున్నారు. టాలీవుడ్ సినిమాల బడ్జెట్లు సైతం గత కొన్నేళ్లలో ఊహించని స్థాయిలో పెరిగాయనే సంగతి తెలిసిందే.