దసరా (Dasara Movies) పండుగ కానుకగా ఎక్కువ సంఖ్యలో సినిమాలు విడుదలయ్యాయనే సంగతి తెలిసిందే. వేట్టయన్ (Vettaiyan), విశ్వం (Viswam) ఒకింత భారీ అంచనాలతో రిలీజయ్యాయి. ఇప్పటికే థియేటర్లలో రన్ అవుతున్న దేవర (Devara) ఎక్కువ సంఖ్యలో స్క్రీన్లలోనే ప్రదర్శితమవుతోంది. దేవర సినిమాకు సండే బుకింగ్స్ కూడా బాగానే ఉన్నాయి. ఆన్ లైన్ లో కంటే ఆఫ్ లైన్ లో ఈ సినిమాకు ఎక్కువ బుకింగ్స్ జరుగుతున్నాయని తెలుస్తోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్, ఓపెన్ ప్లేస్ లో సక్సెస్ మీట్ లేకుండానే దేవర బాక్సాఫీస్ వద్ద సులువుగానే లక్ష్యాన్ని సాధిస్తోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
దేవర తర్వాత చాలామంది వేట్టయాన్ సినిమాపై దృష్టి పెడుతున్నారు. రజనీకాంత్ (Rajinikanth) మూవీ కావడం, ఆసక్తికర సన్నివేశాలు ఉండటం ఈ సినిమాకు ఎంతగానో ప్లస్ అవుతోంది. వేట్టయన్ మూవీ బాక్సాఫీస్ కలెక్షన్లు పరవాలేదనే స్థాయిలో ఉండటం గమనార్హం. జిగ్రా (Jigra) మూవీ విషయానికి వస్తే హిందీ వెర్షన్ బుకింగ్స్ బాగున్నాయి. విశ్వం సినిమా శనివారం బుకింగ్స్ బాగానే ఉండగా మిక్స్డ్ టాక్ ఉన్నా ఫ్యామిలీ మూవీ కావడం ఈ సినిమాకు ప్లస్ అవుతోంది.
విశ్వం మూవీ బుకింగ్స్ కొంతమేర పుంజుకోవాల్సి ఉంది. జనక అయితే గనక (Janaka Aithe Ganaka) సినిమాకు రివ్యూలు పాజిటివ్ గా ఉన్నా బుకింగ్స్ ఆ స్థాయిలో లేవు. సుహాస్ (Suhas) ఈ సినిమా ప్రమోషన్స్ ను మరింత పెంచాల్సిన అవసరం ఉంది. మా నాన్న సూపర్ హీరో (Maa Nanna Superhero) సినిమాకు సైతం బుకింగ్స్ మరింత పుంజుకోవాల్సి ఉంది. మార్టిన్ (Martin) సినిమాకు నెగిటివ్ టాక్ మైనస్ కాగా ఈ సినిమా బుకింగ్స్ పుంజుకునే అవకాశం అయితే లేదనే చెప్పాలి.
ఈ సినిమాల కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉండనున్నాయో అనే చర్చ సైతం సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. దసరా పండుగకు (Dasara Movies) ఎక్కువ సినిమాలు విడుదలైనా 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు రన్ అయ్యేలా చేసే సినిమా అయితే లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి.