పెళ్లి కొడుకైన నాగ చైతన్య..!

అక్కినేని నాగ చైతన్య పెళ్లి చేసుకోవడం ఏంటి అనుకుంటున్నారా? ఇది కేవలం ప్రేమమ్ చిత్రం కోసమే.. మలయాళం లో హిట్ కొట్టిన ప్రేమమ్ చిత్రాన్ని తెలుగు లో అదే పేరుతో రీమేక్ చేస్తుండగా.. ఈ రీమేక్ లో నాగ చైతన్య కథానాయకుడిగా నటిస్తున్నాడు.

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి చైతు పెళ్లి సన్నివేశాలను రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరిస్తున్నారు.మరోవైపు మే 3 నుంచి ఈ చిత్ర చివరి షెడ్యూల్ గోవాలో జరుపుకోనుండగా.. జులై లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. చందు మొండేటి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో చైతు సరసన అనుపమ పరమేశ్వరన్, శృతి హాసన్, మడోనా సెబాస్టియన్ లు జంటగా
నటిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus