Naga Chaitanya: అనౌన్స్మెంట్ దశలోనే ఆగిపోయిన నాగ చైతన్య సినిమాలు..!

‘సర్కారు వారి పాట’ దర్శకుడు పరశురామ్ తో నాగ చైతన్య ఓ మూవీ చేయాలి. కానీ ఇది అనౌన్స్మెంట్ దశలోనే ఆగిపోయింది. అందుకు కారణాలేంటో తెలీదు కానీ నాగ చైతన్య మాత్రం చాలా హర్ట్ అయినట్టు ‘కస్టడీ’ ప్రమోషన్లలో ఓపెన్ అయ్యాడు. ఇది మాత్రమే కాదు గతంలో కూడా నాగ చైతన్య హీరోగా కొన్ని సినిమాలు అనౌన్స్మెంట్ దశలోనే ఆగిపోయాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :

1. గౌరవం:

నాగ చైతన్య, రాధామోహన్ కాంబినేషన్లో ‘గౌరవం’ సినిమా బైలింగ్యువల్ మూవీగా మొదలైంది. కానీ చైతన్య ఈ ప్రాజెక్టు నుండి తప్పుకున్నాడు.

2. హలో బ్రదర్:

నాగ చైతన్య, ‘ఢమరుఖం’ ఫేమ్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, హీరోయిన్ లావణ్య త్రిపాఠి కాంబోలో ‘హలో బ్రదర్’ అనే మూవీని అనౌన్స్ చేశారు. కానీ ఇది మధ్యలోనే ఆగిపోయింది.

3. దుర్గ:

‘హలో బ్రదర్ ‘ రీమేక్ ఆగిపోవడంతో డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో దుర్గ అనే అనౌన్స్ చేశారు . సి.కల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించాలి. కానీ ఎందుకో ఇది కూడా ఆగిపోయింది.

4. అదే నువ్వు అదే నేను:

దిల్ రాజు నిర్మాణంలో శశి అనే నూతన దర్శకుడితో నాగ చైతన్య, రష్మిక కాంబోలో ‘అదే నువ్వు అదే నేను’ మూవీ చేయాలి. కానీ ఈ మూవీ కూడా ఆగిపోయింది.

5. నాగ చైతన్య – ఇంద్రగంటి చిత్రం :

అక్కినేని నాగ చైతన్య మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఒక చిత్రం రూపొందాల్సి ఉంది. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించడానికి రెడీ అయ్యారు. కానీ ఎందుకో ఈ మూవీ పట్టాలెక్కలేదు.

6. నాగేశ్వరరావు :

(Naga Chaitanya) నాగ చైతన్య, పరశురామ్ కాంబినేషన్ లో ‘నాగేశ్వరరావు’ అనే సినిమా రూపొందాల్సి ఉంది. అధికారిక ప్రకటన కూడా వచ్చింది.కానీ పరశురామ్.. ఈ చిత్రాన్ని పక్కన పెట్టి, మహేష్ బాబుతో ‘సర్కారువారి పాట’ మూవీ చేయడానికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత విజయ్ దేవరకొండ, కార్తీ అంటూ తిరగడంతో నాగ చైతన్య.. పరశురామ్ కథని రిజెక్ట్ చేశాడు.

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus