యువ సామ్రాట్ నాగ చైతన్య, టాలీవుడ్ క్యూట్ బ్యూటీ సమంతలు పెళ్లి పీటలు ఎక్కే ఘడియలు దగ్గర పడ్డాయి. వీరిద్దరికి నిశ్చితార్దాన్నీ ఈనెల 29 న నిర్వహించేందుకు అక్కినేని నాగార్జున సిద్ధమయ్యారు. ఈ కార్యక్రమ పనుల్లో తండ్రి బిజీగా ఉంటే అదే రోజు మేనమామ సురేష్ బాబు మరో శుభకార్యానికి ప్లాన్ చేస్తున్నారు. ఎప్పటి నుంచో మేనల్లుడు నాగ చైతన్యతో తీయాలనే సినిమాకు శ్రీకారం చుట్టనున్నారు. కృష్ణ అనే కొత్త దర్శకుడు కొన్నాళ్ల క్రితం సురేష్ బాబుకి కథ చెప్పారు. ఎంతో బాగా నచ్చింది. ఈ స్టోరీ రానా కి నచ్చడంతో అతను కూడా ప్రొడ్యూస్ చేయడానికి ముందుకొచ్చారు.
తండ్రి కొడుకులు కలిసి నిర్మించనున్న మూవీ ముహూర్తపు షాట్ ని జనవరి 29 చిత్రీకరించాలని నిర్ణయం తీసుకోనున్నారు. సమంత, చైతూ లైఫ్ లోకి వచ్చే రోజు కెరీర్ పరంగా శుభం కలుగుతోందని అక్కినేని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. చైతూ, సమంత కలిసి చేసిన మొదటి చిత్రం ఏ మాయ చేసావే ఇద్దరి కెరీర్ కి మంచి టర్నింగ్ ఇచ్చింది. సో నిశ్చితార్ధం అయిన తర్వాత నాగ చైతన్య చేయబోయే ప్రాజక్ట్ సూపర్ హిట్ అవుతుందని నమ్ముతున్నారు. ఇందులో హీరోయిన్ గా సమంత నటించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.