ఇటీవల శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ సినిమాను పూర్తి చేసిన నాగచైతన్య ఇప్పుడు తన ‘థాంక్యూ’ సినిమా షూటింగ్ కి సిద్ధమవుతున్నాడు. విక్రమ్ కె కుమార్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అబిడ్స్ లోని రామకృష్ణ థియేటర్ లో జరుగుతుంది. థియేటర్ లో నాగచైతన్య పై కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ సినిమాలో చైతు.. సూపర్ స్టార్ మహేష్ బాబు వీరాభిమాని పాత్రలో కనిపించనున్నారు.
మహేష్ బాబు అభిమానుల సంఘం అధ్యక్షుడు అభిరామ్ అనే పాత్రలో చైతు దర్శనమివ్వనున్నాడు. ఓ మామూలు కుర్రాడిగా, మహేష్ బాబు సినిమాల విడుదల సమయంలో థియేటర్ల వద్ద కటౌట్ కట్టే స్థాయి నుండి విదేశాల్లో బిజినెస్ మ్యాన్ గా ఎదిగిన కుర్రాడు తన ఎదుగుదలకు కారణమైన వారందరికీ ఎలా థాంక్స్ చెప్పాడనే లైన్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు మంచి డెప్త్ ఉంటుందట. ఎవరు పడితే వారు సూట్ కారనే ఉద్దేశంతో దర్శకనిర్మాతలు సమంత అయితే బాగుంటుందని అనుకున్నారట.
అదే విషయాన్ని చైతు వద్ద ప్రస్తావించగా.. ఆయన నో అని చెప్పేశారట. మొన్నటికి మొన్నే ‘మజిలీ’ సినిమాలో కలిసి నటించామని.. మళ్లీ ఇప్పట్లో వద్దని.. మరొకరిని తీసుకోమని చెప్పేశాడట చైతు. దీంతో ఇప్పుడు మరో హీరోయిన్ కోసం వెతుకులాట సాగిస్తున్నారు. ఐశ్వర్య, అవికా గోర్ లాంటి హీరోయిన్ల పేర్లు వినిపిస్తున్నప్పటికీ ఇప్పటివరకు అయితే ఎవరినీ ఫైనల్ చేయలేదు.
Most Recommended Video
2020 Rewind: కరోనా టైమ్ లో దర్శకుల అరంగేట్రం అదిరింది..!
సోనూసూద్ గొప్ప పనుల నుండీ ప్రభాస్ సినిమాల వరకూ.. 2020 టాప్ 10 ఇవే..!
2020 Rewind: నింగికెగసిన తారలు వీళ్లే..!