చైతు, సాయి పల్లవి తో శేఖర్ కమ్ముల మూవీ?

‘మజిలీ’ చిత్రంతో ఈ సమ్మర్ కి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు నాగ చైతన్య. ప్రస్తుతం ‘వెంకీ మామ’ చిత్రంలో నటిస్తూ బిజీగా గడుపుతున్న చైతూ.. మరోపక్క తన తరువాతి ప్రోజెక్టులను కూడా లైన్లో పెట్టేస్తున్నాడు. తన తండ్రి నాగార్జునతో కలిసి ‘బంగార్రాజు’ చిత్రంలో నటించబోతున్నాడనే వార్త ప్రచారంలో ఉంది. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రానికి సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కబోతుంది. జూలై నెలాఖరున ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళనుందని తెలుస్తుంది. అలానే ‘యూవీ క్రియేషన్స్’ బ్యానర్లో ఓ కూడా ఓ చిత్రం చేయబోతుంది అలానే దిల్ రాజుతో నిర్మాణంలో కూడా ఓ చిత్రం చేయడానికి రెడీ అవుతున్నాడు.

వీటితో పాటు .. చైతు మరో క్రేజీ ప్రాజెక్ట్ ని ఓకే చేసినట్టు తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే.. ‘ఫిదా’ వంటి బ్లాక్ బస్టర్ అందుకున్న శేఖర్ కమ్ముల డైరెక్షన్లో ఓ చిత్రం చేయబోతున్నాడట చైతు. ఈ చిత్రంలో కూడా సాయి పల్లవినే హీరోయిన్ గా ఎంచుకున్నాడట. కాంబినేషన్ వింటేనే బ్లాక్ బస్టర్ ఖాయమనిపిస్తుంది కదూ…! మరి శేఖర్ కమ్ముల ఈసారి ఎలాంటి కథను ఎంచుకున్నాడనో తెలియాలి మరి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus