వైరల్… ‘లవ్ స్టోరీ’ నుండీ లీకైన కీలక సన్నివేశం..!

కరోనా లాక్‌డౌన్ కారణంగా నిలిచిపోయిన.. ‘లవ్ స్టోరీ’ చిత్రం షూటింగ్ ఈ మధ్యనే తిరిగి ప్రారంభమైన సంగతి తెలిసిందే. శేఖర్ కమ్ముల డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్నారు. ‘మజిలీ’ ‘వెంకీ మామ’ వంటి హిట్ చిత్రాల తరువాత నాగ చైతన్య చేస్తున్న సినిమా కావడం అలాగే.. ‘ఫిదా’ వంటి బ్లాక్ బస్టర్ తరువాత శేఖర్ కమ్ముల – సాయి పల్లవి కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం కావడంతో..’ఎప్పుడెప్పుడు ఈ చిత్రాన్ని చూస్తామా’ అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

ఇదిలా ఉండగా.. ఈ చిత్రం నుండీ ఓ కీలక సన్నివేశం లీకవ్వడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. వివరాల్లోకి వెళితే.. ఈ మధ్యనే ‘లవ్ స్టోరీ’ కి సంబంధించి ఓ కీలక సన్నివేశాన్ని ఆర్మూర్ సమీపంలో ఉన్న నవసిద్ధుల గుట్ట పై చిత్రీకరించారు. అయితే చిత్రీకరణ సమయంలో ఆర్మూరుకు చెందిన నివాసులు… వారి స్మార్ట్ ఫోన్లలో ఆ సన్నివేశాన్ని బందించేసారు.ఈ సన్నివేశంలో నవసిద్ధుల గుట్ట పై సాయి పల్లవి చెయ్యి పట్టుకుని హీరో నాగ చైతన్య పరుగు పెడుతున్నాడు.

ఈ వీడియో బయటికి రావడమే వైరల్ అయిపోయింది. అయితే చిత్ర యూనిట్ సభ్యులు వెంటనే అప్రమత్తమై ఈ వీడియోని డిలీట్ చేయించేశారని తెలుస్తుంది.ఇక ఈ చిత్రాన్ని ‘శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి’ బ్యానర్‌పై నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు.

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus