నాగచైతన్య, సమంత, శివ నిర్వాన మజిలి సినిమా ఫస్ట్ లుక్ విడుదల.!
- December 31, 2018 / 08:29 AM ISTByFilmy Focus
అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా నటిస్తున్న చిత్రానికి మజిలీ అనే టైటిల్ కన్ఫర్మ్ చేశారు. ఈ చిత్రానికి దేర్ ఈజ్ లవ్.. దేర్ ఈజ్ పెయిన్ అనే క్యాప్షన్ పెట్టారు. అంటే ప్రేమ ఉంది.. బాధ ఉందని అర్థం. ఈ చిత్ర ఫస్ట్ లుక్ కూడా చాలా ఎమోషనల్ గా ఉంది. నాగచైతన్య, సమంత లుక్ ఇందులో చాలా కొత్తగా ఉంది. నిన్నుకోరి లాంటి ఎమోషనల్ హిట్ సినిమా తెరకెక్కించిన శివ నిర్వాణ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
వైజాగ్ నేపథ్యంలో ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ తెరకెక్కుతోంది. దివ్యాంశ కౌశిక్ ఈ చిత్రంలో రెండో హీరోయిన్ గా నటిస్తున్నారు. రావు రమేష్, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందిస్తుండగా.. విష్ణు వర్మ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సాహు గరపాటి, హరీష్ రెద్ది మజిలీ చిత్రాన్ని షైన్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.
Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
















