‘బంగార్రాజు’కి చైతు డేట్స్ ఇస్తాడా..?

చాలా కాలంగా ‘బంగార్రాజు’ ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తీసుకువెళ్లాలని చూస్తున్నాడు నాగార్జున. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కథ మొత్తం రెడీ చేసుకొని షూటింగ్ కోసం సిద్ధంగా ఉన్నాడు. కానీ ఈ సినిమాకి నాగ్ కాకుండా మరో హీరో కావాల్సివుంది. దానికోసం మొదటి నుండి కూడా నాగచైతన్యను తీసుకోవాలని అనుకున్నారు. కానీ ఇక్కడే అసలు సమస్య మొదలైంది. చైతూ తన కెరీర్ లో ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాడు. దీంతో చైతుకి బదులు మరో హీరోని వెతుక్కోవాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో చాలా మంది హీరోల పేర్లు పరిశీలించినప్పటికీ.. ఎవరినీ ఫైనల్ చేయలేదు.

నాగార్జున మాత్రం ఈ పాత్రని చైతూతోనే చేయించాలని భావిస్తున్నాడు. అందుకే చైతుపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు సమాచారం. కాల్షీట్స్ అడ్జస్ట్ చేసుకొని ఎలాగైనా.. ఈ సినిమాలో నటించమని అడుగుతున్నాడట. నాగార్జున ఇలా చైతుని ఫోర్స్ చేయడం వెనుక మరో కారణం కూడా ఉంది. ఈ సినిమాను అన్నపూర్ణ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. మరో హీరోని తీసుకుంటే రెమ్యునరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. చైతు ఇంట్లో హీరో కాబట్టి ఎలాంటి గొడవ ఉండదు. పైగా ఈ కథ నాగార్జున బాగా నచ్చడంతో.. చైతు చేస్తే కాంబినేషన్ పరంగా కూడా వర్కవుట్ అవుతుందని భావిస్తున్నాడు.

ఇద్దరూ కలిసి నటించే కథలు చాలా అరుదుగా వస్తాయని.. వచ్చినప్పుడు ఆ ఛాన్స్ వదులుకోకూడదని.. చైతుకి చెబుతున్నాడట నాగ్. అయితే ఈ విషయంలో చైతు ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ప్రస్తుతం చైతు ‘థాంక్యూ’ సినిమాలో నటిస్తున్నాడు. ఇంద్రగంటి మోహన్ కృష్ణతో ఓ సినిమా కమిట్ అయ్యాడు. వీటితో పాటు మైత్రి మూవీస్ తో ఓ సినిమా చేయనున్నాడు. సురేష్ ప్రొడక్షన్స్ లో ఓ సినిమా ఉంటుందని అంటున్నారు. ఇన్ని కమిట్మెంట్స్ మధ్య ‘బంగార్రాజు’ సినిమాకి కాల్షీట్స్ ఇవ్వలేకపొతున్నాడు.

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus