Naga Chaitanya, Sobhita: నాగచైతన్య – శోభితా.. మొదటి చూపు కలిసింది ఎప్పుడంటే?

నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల వివాహ వార్తలు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. డిసెంబర్ 4న వీరి పెళ్లి అక్కినేని ఫ్యామిలీకి చెందిన అన్నపూర్ణ స్టూడియోస్‌లో అత్యంత ప్రైవేట్‌గా జరగనుంది. ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరవుతారని తెలుస్తోంది. అయితే చై-శోభితా బంధం ఎలా ఏర్పడింది? వీరిద్దరి పరిచయం ఎలా మొదలైంది? అనేది అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. వివరాల్లోకి వెళితే, శోభితా ధూళిపాళ్లకు మొదట అక్కినేని ఫ్యామిలీతో సంబంధం అప్పుడే ఏర్పడిందట.

Naga Chaitanya, Sobhita

తన మొదటి ప్రాజెక్ట్ సమయంలో అన్నపూర్ణ స్టూడియోస్‌లో పని చేసిన శోభితకు అక్కడే నాగార్జునతో పరిచయం ఏర్పడింది. ఆమె పనితనానికి, ప్రతిభకు ముగ్ధుడైన నాగార్జున, ప్రత్యేకంగా ఆమెను హైదరాబాదులో కలవాలని ఆహ్వానించారు. ఆ సమయంలోనే అనుకోకుండా నాగచైతన్య అక్కడికి రావడం, శోభితను చూడడం జరిగిందని సినీ వర్గాలు చెబుతున్నాయి. అదే వారి మొదటి చూపు. స్నేహంగా ప్రారంభమైన ఈ బంధం, కొద్దికాలంలో ప్రేమగా మారిందని తెలుస్తోంది.

“శోభిత విలువలకు కట్టుబడి, నిలకడైన ఆలోచనలు కలిగిన అమ్మాయి. ఆమె కాబోయే కోడలుగా రావడం చాలా ఆనందంగా ఉంది,” అంటూ నాగార్జున పలు ప్రశంసలు కురిపించారు. శోభిత కుటుంబ సభ్యులు కూడా ఈ బంధంపై సంతోషం వ్యక్తం చేసినట్లు సమాచారం. వైజాగ్‌లో పుట్టి పెరిగిన శోభిత, తన కలలను సాధించుకోవడానికి ఎంతో కష్టపడింది.

తక్కువ సమయంలోనే పరిశ్రమలో మంచి గుర్తింపు పొందింది. పెళ్లి చాలా సింపుల్‌గా జరుగుతుందట. ఫిల్మ్ ఇండస్ట్రీలోని ప్రముఖులు కూడా పరిమిత సంఖ్యలోనే ఆహ్వానించబడుతున్నారు. ప్రత్యేకించి, ఈ వేడుకకు పెద్ద ఎత్తున మీడియా కవరేజ్ లేకుండా ప్రైవేట్‌గా నిర్వహించడానికి అక్కినేని ఫ్యామిలీ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus