ఫస్ట్ టైం ఉమెన్స్ కాలేజ్ లోపలికి వెళ్ళాను!! : నాగచైతన్య

నాగచైతన్య తన చిన్ననాటి స్నేహితుడు కృష్ణముత్తు దర్శకత్వంలో నటించిన చిత్రం “యుద్ధం శరణం”. లావణ్య త్రిపాఠి కథానాయికగా నటించిన ఈ చిత్రంలో కుటుంబ కథానాయకుడిగా విశేషమైన ఇమేజ్ ఉన్న శ్రీకాంత్ మొదటిసారి నెగిటివ్ రోల్ లో నటిస్తున్న ఈ చిత్రాన్ని వారాహి చలనచిత్రం సంస్థ నిర్మిస్తోంది. రేపు విడుదలవుతున్న ఈ చిత్రం గురించి చిత్ర కథానాయకుడు నాగచైతన్య చెప్పిన విశేషాలు ఆయన మాటల్లోనే..!!

అందుకే కాలేజస్ లో ప్రమోట్ చేస్తున్నా..
ఇప్పటివరకూ నేను నటించిన సినిమాల్లో చాలా డిఫరెంట్ ఫిలిం “యుద్ధం శరణం”. సోషల్ మీడియా నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ఇది, అందుకే ఎక్కువగా కాలేజస్ లో ప్రమోట్ చేసాం. వారుసబెట్టి అన్ని కాలేజస్ కి వెళ్లడం, అక్కడి స్టూడెంట్స్ అందరినీ కలవడం ఎప్పటికీ మరచిపోలేని అనుభూతి.

ఎప్పుడూ బయట వెయిట్ చేసేవాడ్ని, ఫస్ట్ టైం లోపలికెళ్లా..
కాలేజ్ టైం లో లేడీస్ హాస్టల్స్ బయట తచ్చాడేవాడ్ని, కానీ ఫస్ట్ టైం “యుద్ధం శరణం” సినిమా ప్రమోషన్ కోసం భీమవరంలోని లేడీస్ కాలేజ్ లోపలికెళ్లినప్పుడు అదో రకమైన ఫీలింగ్. అక్కడ వాళ్ళు నన్ను రిసీవ్ చేసుకున్న విధానానికి తెగ ముచ్చటేసింది.

ఇదో ఇంటెలిజంట్ థ్రిల్లర్..
“యుద్ధం శరణం” ఒక ఇంటెలిజంట్ థ్రిల్లర్, ఫ్యామిలీ అండ్ లవ్ ఎమోషన్స్ తోపాటు ఒక మంచి సోషల్ ఎలిమెంట్ ఉంటుంది. ఫైట్స్ కూడా ఉంటాయి కానీ.. మాగ్జిమం మైండ్ గేమ్ తో స్క్రీన్ ప్లే రన్ అవుతుంటుంది. విలన్ తో డైరెక్ట్ గా తలపడకుండా సోషల్ మీడియాను బేస్ చేసుకొని ఎలా ఎదుర్కొన్నాడు అనేది సినిమా థీమ్.

స్నేహితుడితో సినిమా చేయాలన్నది నాకొక కల..
ఎప్పటినుంచో నా స్నేహితుడి దర్శకత్వంలో ఒక సినిమాలో నటించాలి అనేది నా కల. అది నా ప్రాణ స్నేహితుడు కృష్ణముత్తుతో నెరవేరుతుండడం ఆనందంగా ఉంది. కృష్ణముత్తు చెప్పిన కథ నచ్చడం వల్లే అతడితో సినిమా చేస్తున్నానే తప్ప కేవలం స్నేహితుడనే భావనతో కాదు.

కొర్రపాటి ఎంకరేజ్ మెంట్ బాగుంటుంది..
సాయికొర్రపాటి గారికి ఒకసారి కథ నచ్చిందంటే.. అప్పటికే మంచి స్పాన్ ఉన్న సినిమా రేంజ్ ఇంకా పెరుగుతుంది. ఆయన వల్లే సినిమాలో రావురమేష్, రేవతి వంటి ఆర్టిస్టులు యాక్ట్ చేసారు. ప్రమోషన్ విషయంలోనూ ఆయన ఎక్కడా తగ్గలేదు. ఆయన బ్యానర్ లో వర్క్ చేయడం చాలా మంచి ఎక్స్ పీరియన్స్.

శ్రీకాంత్ గారితో కలిసి వర్క్ చేయడం మెస్మరైజింగ్ ఎక్స్ పీరియన్స్..
మా నాన్నగారితో కలిసి విలన్ గా, బ్రదర్ గా వర్క్ చేసిన శ్రీకాంత్ గారితో కలిసి వర్క్ చేయడం ఒక డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్. ఆయన ఈ సినిమాలో విలన్ అవ్వడం, ఆయనతో పోటీపడి నటించడం ది బెస్ట్ వర్కింగ్ ఎక్స్ పీరియన్స్. ఆయన క్యారెక్టరైజేషన్ కారణంగా నా క్యారెక్టర్ ఇంకా బాగా ఎలివేట్ అయ్యింది.

లావణ్యకున్న రెప్యుటేషన్ అలాంటిది..
హీరోయిన్ గా లావణ్య త్రిపాఠీకి కథ-క్యారెక్టర్ నచ్చితే తప్ప సినిమా చేయదనే మంచి పేరుంది. ఆ రెప్యుటేషన్ కు తగ్గట్లే ఈ సినిమా క్యారెక్టర్ ఉంటుంది. హీరో పాత్రకి అనునిత్యం అండగా నిలిచే పాత్ర ఆమెది.

24 గంటల స్పాన్ లో జరిగే కథ..
ఈ సినిమాలో నేను ఒక డ్రోన్ మేకర్ గా నటిస్తున్నాను. యూత్ బాగా కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ ఇది. అలాగే.. సినిమా మొత్తం 24 గంటల స్పాన్ లో జరుగుతుంది. అందువల్ల నైట్ షూట్స్ ఎక్కువగా ఉన్నప్పటికీ.. ప్రొడ్యూసర్ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకపోవడం వల్ల క్వాలిటీ ఔట్ పుట్ వచ్చింది.

కార్తికేయ సినిమాకి పెద్ద ఎస్సెట్..
“బాహుబలి” తర్వాత రాజమౌళి తనయుడు కార్తికేయ వర్క్ చేసిన ప్రాజెక్ట్ “యుద్ధం శరణం” ప్రతి ఒక్కరితో బాగా కోఆర్డినెట్ చేసుకుంటూ సినిమాకి సెకండ్ యూనిట్ లా వర్క్ చేసాడు కార్తికేయ. అతడి చాకచక్యం సినిమాకి, యూనిట్ కి బాగా ఉపయోగపడింది.

సెప్టంబర్ 20 నుంచి “సవ్యసాచి” మొదలు..
నెక్స్ట్ చందు మొండేటి దర్శకత్వంలో “సవ్యసాచి” అనే సినిమా ఒకే చేసాను. ఎడమ చెయ్యి తన ఆధీనంలో లేని ఓ యువకుడి కథే ఈ చిత్రం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం తాతగారి పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 20న మొదలవుతుంది. ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీ ఇది.

పెళ్లి నా ఇష్టం.. రిసెప్షన్ నాన్న ఇష్టం..
నా ఇష్ట ప్రకారం పెళ్లి ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా అక్టోబర్ 6న హిందూ సాంప్రదాయబద్ధంగా, 7న సమంతకు ఇష్టమైన క్రియష్టియన్ పద్ధతుల్లో జరుగుతుంది. రిసెప్షన్ మాత్రం నాన్నగారికి నచ్చినట్లుగా భారీ స్థాయిలో జరిగుతుంది.

– Dheeraj Babu


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus