Naga Chaitanya: తండేల్ నుంచి రిలీజైన నాగచైతన్య ఎనర్జిటిక్ పోస్టర్!

అక్కినేని నాగచైతన్య తాజాగా దూత వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ వెబ్ సిరీస్ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఇక ఈ సిరీస్ తర్వాత ఈయన తన తదుపరి చిత్రం తండేల్ సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ పనులను ప్రారంభం చేసుకుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి నాగచైతన్య లుక్ కి సంబంధించినటువంటి ఒక ఎనర్జిటిక్ పోస్టర్ విడుదల చేశారు.

ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో భాగంగా నాగచైతన్య వల భుజాన వేసుకొని సముద్రంలోకి వెళుతూ ఉండగా చుట్టుపక్కల పడవలు ఉండటం మనం చూడవచ్చు. ఇలా ఈ పోస్టర్ వైరల్ గా మారడంతో సముద్రం నాగచైతన్య సాహసం చేయబోతున్నారని స్పష్టంగా అర్థం అవుతుంది. ఇదివరకే ఈ సినిమాకు సంబంధించి వర్క్ షాప్ నిర్వహించడం జరిగింది దీంతో ఈ పోస్టర్ విడుదల చేశారు.

ఈ సినిమాలో నాగచైతన్య ఒక మత్స్యకారుడి పాత్రలో నటించబోతున్నారని తెలుస్తోంది. ఒక మత్స్యకారుడి నిజ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాకు ప్రముఖ డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహించగా, గీత ఆర్ట్స్ బ్యానర్ లో ఈ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందు రావడానికి సిద్ధమవుతుంది.

ఇక ఈ సినిమాలో నాగచైతన్య (Naga Chaitanya) సరసన మరోసారి నటి సాయి పల్లవి జతకట్టబోతున్నారు. ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో లవ్ స్టోరీ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మంచి బ్లాక్ బస్టర్ హీట్ అందుకుంది. ఈ సినిమా తర్వాత నాగచైతన్యకు సరైన హిట్ లేదంటే చెప్పాలి తిరిగి వీరిద్దరి కాంబినేషన్లో మరోసారి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందనే విషయం తెలియడంతో ఈ సినిమాపై కూడా అంచనాలు పెరిగిపోయాయి.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus