సూపర్ కూల్ లుక్ లో నాగ చైతన్య

హీరో నాగ చైతన్య, సాయి పల్లవి జంట గా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న కొత్త సినిమా నుండి హీరో చైతు లుక్ విడుదలైంది. ఈ పోస్టర్ లో సూపర్ కూల్ లుక్ లో నాగ చైతన్య ఉల్లాసంగా కనిపిస్తున్నాడు.చైతు బర్త్ డే సందర్భంగా నవంబర్ 23న ఉదయం 10.30 నిమిషాలకు హీరో క్యారెక్టర్ ని పరిచయం చేసే ఓ వీడియోను రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్.సహజత్వం నింపుకొన్న ఉన్న పాత్రలతో అందమైన కథలను తెర మీద కు తెచ్చే శేఖర్ కమ్ముల ఈ ప్రేమ కథను మరింత హృద్యంగా మలుచుతున్నాడు. నాగ చైతన్య లుక్ విషయంలో మరింత కేర్ తీసుకుంటున్నారు డైరెక్టర్. తన ప్రపంచంలో కి ఆయన బర్త్ డే సందర్భంగా మనల్ని అహ్వానిస్తున్నాడు చైతు. అక్కినేని అభిమానులకు, సినిమా అభిమానులకు కొత్త ఎక్స్ పీరియన్స్ గా ఉండ బోతుంది ఆ వీడియో.

ఏమిగోస్ క్రియేషన్స్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు ఈ సినిమానునిర్మిస్తున్నారు. నాగచైతన్య సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీలో రాజీవ్ కనకాల,ఈశ్వరీ రావు,దేవయాని ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్ సినిమా రివ్యూ & రేటింగ్!
యాక్షన్ సినిమా రివ్యూ & రేటింగ్!
తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus