Naga Chaitanya: అక్కినేనికి హిట్‌ ఇచ్చే బ్యానర్‌లో మళ్లీ చైతన్య.. దర్శకుడు ఆయనేనా?

నాగచైతన్యకు అర్జెంట్‌గా ఓ మంచి హిట్‌ కావాలి. ఇటీవల కాలంలో విజయాలు వస్తున్నా.. సాలిడ్‌ మాస్ హిట్‌ పడి చాలా రోజులైంది. అయితే దీని కోసం గీతా ఆర్ట్స్‌ ఓ ప్లాన్‌ రెడీ చేస్తోందని సమాచారం. ఈ మేరకు గీతా ఆర్ట్స్‌ టీమ్ ఓ దర్శకుడిని కూడా సిద్ధం చేసిందని అంటున్నారు. అతను గతంలో చైతన్యతో ఓ సినిమా చేసిన దర్శకుడు కావడం గమనార్హం. దీంతో ఈ కాంబో గురించి ఫ్యాన్స్‌ ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు.

గీతా ఆర్ట్స్‌కు, అక్కినేని ఫ్యామిలీకి మంచి అనుబంధం ఉంది. అక్కినేని యువ హీరోలకు హిట్‌ అవసరం అయిన సమయంలో ఆ బ్యానర్‌లోనే సినిమాలు వచ్చాయి, విజయం సాధించాయి కూడా. అలా గతంలో చైతన్యకు ‘100 పర్సెంట్‌ లవ్‌’ సినిమా పడింది. ఇప్పుడు మళ్లీ ఈ కాంబో సిద్ధమవుతోంది. ఈసారి ఆ సినిమా చేయబోయేది చందూ మొండేటి అని అంటున్నారు. గతంలో ఈయన చైతన్యతో ‘సవ్యసాచి’ అనే సినిమా చేశారు.

ఆ సినిమా సరైన విజయం అందుకోకపోయినా.. (Naga Chaitanya) చైతన్యను సరికొత్తగా చూపించారు అనే పేరు అయితే సంపాదించారు. ఇప్పుడు ఆ సినిమా చేదు ఫలితాన్ని మరిపించేలా కొత్త కథను సిద్ధం చేసుకున్నారని టాక్‌. త్వరలోనే ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌ ఉంటుంది అంటున్నారు. ‘కస్టడీ’తో ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన చైతన్య ఆశించిన ఫలితం అందుకోలేకపోయాడు. దీంతో ఈ సినిమా ఫలితం చాలా కీలకంగా మారింది అని చెప్పాలి.

గతేడాది ‘బంగార్రాజు’ లాంటి క్లాస్‌ హిట్ నాగచైతన్య ఆ తర్వాత ‘థాంక్యూ’, ‘లాల్‌ సింగ్‌ చద్దా’, ‘కస్టడీ’ చేశాడు. ఈ రెండూ ఇబ్బందికరంగానే మిగిలాయి. దీంతో ఇప్పుడు చందూ మొండేటి సినిమా మీద నమ్మకాలు, ఆశలు ఎక్కువగానే ఉంటాయి. GA2 పిక్చర్స్ బ్యానర్‌లో చైతన్యతో సినిమా ఉంటుందని నిర్మాత బన్ని వాస్‌ చెప్పారు. అది ఈ సినిమానే అని టాక్‌? అయితే ‘నాంది’, ‘ఉగ్రమ్’ సినిమాల దర్శకుడు విజయ్ కనకమేడల… నాగచైతన్యతో సినిమా చేయాలని ట్రై చేస్తున్నారు.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus