Thandel: ‘తండేల్’ కథ వెనుక కూడా ఇంత కథ ఉందా?

నాగ చైతన్య (Naga Chaitanya) కెరీర్లో భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందుతుంది ‘తండేల్'(Thandel) . సాయి పల్లవి  (Sai Pallavi) హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని చందు మొండేటి (Chandoo Mondeti) డైరెక్ట్ చేస్తున్నాడు. ప్లాపులతో సతమతమవుతున్న నాగ చైతన్యకి ఈ సినిమా మంది సక్సెస్ అందిస్తుంది అని.. కచ్చితంగా రూ.100 కోట్ల క్లబ్లో అతను ఎంటర్ అవుతాడని.. అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా టాక్ గట్టిగా వినిపిస్తోంది. నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలోనే ఈ సినిమా చాలా మొత్తం రికవరీ చేసిన సంగతి తెలిసిందే.

‘గీతా ఆర్ట్స్’ సంస్థ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ‘తండేల్’ షూటింగ్ 70 శాతం పూర్తయ్యిందట. శ్రీకాకుళంలో నిర్వహించే షెడ్యూల్ తో షూటింగ్ పూర్తవుతుందట. ఈ సినిమా కథ కూడా శ్రీకాకుళం నేపథ్యంలోనే సాగుతుందని టాక్. అయితే ఇప్పటివరకు ‘తండేల్’ కథ.. దర్శకుడు చందూ మొండేటిదే అని అంతా అనుకున్నారు. కానీ కాదు. 2018 లో జరిగిన ఓ రియల్ ఇన్సిడెంట్ ను తీసుకుని రైటర్ కార్తీక్ తీడా ఈ కథని డిజైన్ చేసాడట.

ఈ కథ కోసం అతను ఫిషర్ మాన్స్ తో 2, 3 నెలలు ఉండి.. వాళ్ళ జీవన శైలిని, ఆహారపు అలవాట్లని తెలుసుకున్నాడట. సముద్రంలో వేటకు వెళ్లే టైంలో కూడా ఇతను వారి వెంటే ఉండి వాళ్లకు ఎదురయ్యే సవాళ్ళను గమనించాడట. అలాగే తండేల్ రాజు, బుజ్జి..ల ప్రేమ కథని కూడా బాగా రాసాడట. కథ మొత్తం పూర్తయ్యాక ఇతను ‘గీతా ఆర్ట్స్’ లో వినిపించగా వారు వెంటనే ఓకే చేశారట. కార్తీక్ తీడా స్టార్ డైరెక్టర్ కృష్ణ వంశీ (Krishna Vamsi) వద్ద అసిస్టెంట్ గా పని చేశాడట.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus