చైతు వెనక్కి తగ్గాడు!

  • July 11, 2016 / 11:23 AM IST

జూలై మూడో వారం నుండి ఆగస్ట్ నెల వరకు పెద్ద సినిమాలు రిలీజ్ అవ్వడానికి లైన్ కట్టాయి. దీంతో చిన్న సినిమాల నిర్మాతలు వారి సినిమాలను విడుదల చేయడానికి వెనకడుగు వేస్తున్నారు. అయితే ఈ క్రమంలో నాగచైతన్య కూడా తన సినిమా రిలీజ్ ను వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది.

చైతు ప్రస్తుతం మలయాళం రీమేక్ ‘ప్రేమమ్’ సినిమాలో నటిస్తున్నాడు. తెలుగులో కూడా అదే పేరుతో ఈ సినిమా విడుదలవుతుంది. మొదట ఈ సినిమాను జూలై నెలలో విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు వరుసగా ‘కబాలి’, ‘జనతా గ్యారేజ్’ వంటి పెద్ద చిత్రాలు రిలీజ్ అవుతుండడంతో ఎందుకులే అనుకున్నాడో ఏమో గానీ తన సినిమాను మాత్రం సెప్టెంబర్ లో రిలీజ్ చేయాలని పోస్ట్ పోన్ చేశాడట.

ఇది ఇలా ఉండగా చైతు, గౌతమ్ మీనన్ కాంబినేషన్ లో వస్తోన్న ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రాన్ని మాత్రం ముందుగా చెప్పినట్లే ఈ నెలాఖరున విడుదల చేస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus