Naga Shaurya: రక్షిత్‌కి నడక రానప్పుడు ఎత్తుకుని తిప్పా: నాగశౌర్య కామెంట్స్‌ వైరల్‌

టాలీవుడ్‌లో కొన్ని కాంబినేషన్‌లు చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. అలాగే కొన్ని స్నేహాలు ఇంకా డిఫరెంట్‌గా ఉంటాయి. ఎంతలా అంటే… అవునా వీళ్లిద్దరూ స్నేహితులా అని అనుకునేంత. అలాంటి స్నేహాల్లో ఒకటి ఇప్పుడు బయటకు వచ్చింది. ‘నరకాసుర’ సినిమా ప్రచారంలో భాగంగా సినిమా ట్రైలర్‌ను లాంచ్‌ చేశారు. దీనికి ముఖ్య అతిథిగా యువ కథానాయకుడు నాగశౌర్య వచ్చాడు. ఈ క్రమంలో ఆ సినిమా హీరో రక్షిత్‌ అట్లూరితో ఉన్న తన స్నేహం గురించి చెప్పుకొచ్చాడు.

‘పలాస’ సినిమాతో రక్షిత్ అట్లూరి మంచి పేరు సంపాదించుకున్నాడు. మాస్‌ మసాలా + రూరల్‌ కాంబినేషన్‌లో రూపొందిన ఆ సినిమా మంచి విజయం అందుకుంది. ఆ తర్వాత రక్షిత్‌ చేసిన సినిమాలు సరైన విజయాలు అందుకోకపోయినా… నటుడిగా అయితే మంచి పేరు తీసుకొచ్చాయి. అలా ఇప్పుడు ‘నరకాసుర’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. త్వరలోనే ఈ సినిమాను రిలీజ్‌ చేస్తున్నారు.

రక్షిత్ నాకు చిన్నతనం నుండి తెలుసు. అప్పటి నుండే మా మధ్య స్నేహం ఉంది. వాడికి నడక రానప్పుడు ఎత్తుకుని తిప్పాను అని నాటి రోజులు గుర్తు చేసుకున్నాడు నాగశౌర్య. అంతేకాదు రక్షిత్‌ బై బర్త్ రిచ్ అని, సినిమాల్లోకి వస్తున్నా అని చెప్పినప్పుడు ‘డబ్బుంది కదా సినిమాలు చేస్తాడు’ అనుకున్నాను అని చెప్పాడు. అయితే రక్షిత్‌కు సినిమాల మీద ప్యాషన్ ఉందని, ఎప్పుడూ మంచి సినిమాలు చేయాలనే ఆలోచిస్తుంటారు అని చెప్పాడు (Naga Shaurya) శౌర్య.

రక్షిత్ సాధారణమైన సినిమాలు చేయడని, కొత్త కథలు, రూరల్ బ్యాక్ డ్రాప్ మూవీస్ ఎక్కువగా అటెంప్ట్‌ చేస్తాడని, అవే అతనికి ఇష్టం అని కూడా చెప్పాడు. మామూలుగా మనం ఇలాంటి సినిమాలు, హీరోలను తమిళ, కన్నడ, మలయాళంలో చూస్తుంటామని, ఇప్పుడు తెలుగులో రక్షిత్ చేస్తున్నాడు అని అన్నాడు.

ఇక ఈ సినిమా మీద రక్షిత్‌ బాగా నమ్మకంతో ఉన్నాడు. ఎంతగా అంటే… 2:10 గంటల సినిమా కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది అని అంటున్నాడు. సినిమా చూశాక తాము చెప్పింది నిజం కాదని అనిపిస్తే టికెట్, పాప్ కార్న్ డబ్బులు తిరిగి ఇచ్చేస్తాం అంటున్నాడు. ఇక ఈ సినిమా నవంబర్ 3న తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్‌ చేస్తున్నారు.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus