Naga Shaurya, Anusha Shetty: హల్దీ వేడుకల్లో నాగశౌర్య.. కాబోయే భార్యతో నాగశౌర్య.. పెళ్లి వేడుకలు షురూ!

టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య కాసేపట్లో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. ఈరోజు మధ్యాహ్నం బెంగుళూరుకి చెందిన అనూష అనే అమ్మాయితో శౌర్య వివాహం జరగనుంది. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు గ్రాండ్ గా చేశారు. ఇరు కుటుంబ సభ్యులు అట్టహాసంగా ఈ పెళ్లి వేడుకను జరిపించనున్నారు. బెంగుళూరులోని ఓ స్టార్ హోటల్ లో శౌర్య వివాహం జరగనుంది.

పెళ్లి వేడుకలో భాగంగా హల్దీ సెలబ్రేషన్స్ ను నిర్వహించారు. ఆ తరువాత పార్టీ జరిగింది. ఇందులో ఇరు కుటుంబ సభ్యులకు చెందిన బంధు మిత్రులు, స్నేహితులు పాల్గొన్నారు. ఈ వేడుకలో భాగంగా కాబోయే భార్యకు నాగశౌర్య ఉంగరాన్ని తొడిగారు. ప్రస్తుతం హల్దీ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు నాగశౌర్యకు కంగ్రాట్స్ చెబుతున్నారు. శౌర్య చేసుకోబోతున్న అమ్మాయి అనూషకి ఇంటీరియర్ డిజైనర్ గా మంచి గుర్తింపు ఉంది. సొంతంగా ఓ ఇంటీరియర్ డిజైన్ సంస్థను కూడా స్థాపించారు. ఆమె కుటుంబం వ్యాపార రంగంలో రాణిస్తున్నట్లు తెలుస్తోంది. అనూషతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో ఇంట్లో వాళ్లను ఒప్పించి పెళ్లికి రెడీ అయ్యారు శౌర్య.

ఇక శౌర్య సినిమాల విషయానికొస్తే.. మొదటినుంచి యూత్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తోన్న ఈ హీరోకి ఈ మధ్యకాలంలో సరైన హిట్టు లేదు. అయినప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆయన నుంచి చివరిగా వచ్చిన సినిమా ‘కృష్ణ వ్రింద విహారి’. ఈ సినిమా కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. ప్రస్తుతం ఆయన చేతిలో రెండు, మూడు సినిమాలున్నాయి.

1

2

3

4

5

6

7

8

 

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus