Naga Shaurya: ఇంటర్వ్యూ : ‘రంగబలి’ మూవీ గురించి నాగ శౌర్య చెప్పిన ఆసక్తికర విషయాలు..!

నాగశౌర్య హీరోగా రూపొందిన కొత్త సినిమా ‘రంగబలి’. పవన్ బాసంశెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా మారాడు. ‘దసరా’ వంటి సూపర్ హిట్ ను అందించిన ‘ఎస్‌ఎల్‌వి సినిమాస్‌’ సంస్థ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యుక్తి తరేజ హీరోయిన్ గా నటించింది. టీజర్‌, ట్రైలర్ బాగున్నాయి. జూలై 7న ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా నాగ శౌర్య పాల్గొని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చాడు. అవి మీ కోసం :

ప్ర) జర్నలిస్టులను ఇమిటేట్ చేస్తూ ‘రంగబలి’ ప్రమోషన్ చేసుకోవాలి అనే ఐడియా మీకు ఎలా వచ్చింది?

నాగ శౌర్య : ఈ ఐడియా నాది కాదు. మా ‘రంగబలి’ టీంది. డైరెక్టర్ పవన్ ఐడియాతో ఇదంతా ప్లాన్ చేశాం.

ప్ర) ఇది ప్రమోషన్ కి బాగా ప్లస్ అయ్యింది అనుకుంటున్నారా?

నాగ శౌర్య : అది రిలీజ్ తర్వాత రిజల్ట్ ను బట్టి చెప్పుకోవాలి.

ప్ర) 30 శాతం వీడియో మాత్రమే బయటకు వచ్చింది. మిగిలింది ట్రిమ్ చేశారు .. వివాదాలు జరుగుతాయి అనే భయంతో అంటున్నారు నిజమేనా?

నాగ శౌర్య : అది నాకు కరెక్ట్ గా తెలీదు. కానీ ఇది వేరే రూపంలో మరొకరిని హర్ట్ చేసే అవకాశం ఉండకూడదు అనిపించి కొంత ట్రిమ్ చేయాలి అనుకున్నాం. సత్యకి కుడా ఈ విషయం ఫోన్ చేసి చెప్పాను.

ప్ర) ‘రంగబలి’ విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు?

నాగ శౌర్య: రిజల్ట్ పాజిటివ్ గా వస్తుంది అంటే ఏదో తెలీని ఎనర్జీ వస్తుంటుంది. ఈ సినిమా చూసిన తర్వాత కాన్ఫిడెన్స్ తో వచ్చిన ఎనర్జీ అది. ఆ ఎనర్జీతోనే ప్రమోషన్స్ మొదలుపెట్టాను.

ప్ర) ఈసారి కూడా పవన్ అనే కొత్త దర్శకుడితో చేశారు. మీకు కొంత ఇమేజ్ వచ్చాక కుడా రిస్క్ అనిపించడం లేదా?

నాగ శౌర్య : నా కెరీర్ లో మొత్తం 18 మంది వరకు కొత్త దర్శకులతో చేశాను. ఎప్పుడూ అలా ఫీల్ అవ్వలేదు. నటుడికి స్పేస్ ఇవ్వాలి. పవన్ అలాంటి స్పేస్ నాకు ఇచ్చాడు. ఇది చాలా మంచి కథ. మిస్ చేసుకోకూడదు అనిపించింది.

ప్ర) ఈ సినిమా షూటింగ్ టైంలో మీ హెల్త్ అప్సెట్ అయ్యి అంబులెన్స్ వచ్చిందని విన్నాం..?

నాగ శౌర్య : ప్రేక్షకుల్ని అలరించడానికి నేను దేనిని లెక్క చేయను. నా తోటి హీరోలు ఇంకా చాలా చేస్తున్నారు. గాయాలు అవుతాయి అని నేను కష్టపడకుండా ఉంటే ఎలా?

ప్ర) మీ బ్యానర్లో చేసిన సినిమాలు ఇచ్చిన ఫలితాలతో సంతృప్తి చెందారా?

నాగ శౌర్య : ఏ సంస్థ లో అయినా 10 సినిమాలు హిట్లు పడ్డాయి అనుకోండి.. ఆ తర్వాత పొరపాటున ఓ ఫ్లాప్ పడింది అనుకుందాం. అప్పుడు 9 హిట్లు కంటే …ఆ ఒక్క ఫ్లాప్ నష్టాలను రికవర్ చేయడం చాలా కష్టమైన పని.కానీ మాకు సినిమా అంటే పిచ్చి. డబ్బుల కోసం కాదు ప్యాషన్ కోసం సినిమాలు చేస్తున్నాం.

ప్ర) హీరోయిన్ యుక్తి తరేజ తో పనిచేయడం ఎలా అనిపించింది ?

నాగ శౌర్య : రాబోయే రోజుల్లో ఆ అమ్మాయి లీడింగ్ హీరోయిన్ అవ్వొచ్చు. చాలా చక్కగా నటించింది. మంచి హైట్ ఉంటుంది.

ప్ర) ‘రంగబలి’ అనేది రంగ హత్యని ఆదారం చేసుకుని రూపొందిన సినిమానా?

నాగ శౌర్య : కాదండి.. దానికి దీనికి సంబంధం లేదు. మన ఊర్లో మనం తోపు . సొంత ఊరు అనే ఫీలింగే వేరు. ఈ సినిమా చూస్తున్నపుడు మళ్ళీ మన రూట్స్ ని టచ్ చేసి వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. ఈ సినిమాలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి.

ప్ర) మీ గత సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. ఈ సినిమా సక్సెస్ ఇస్తుంది అనుకోవచ్చా?

నాగ శౌర్య : తప్పకుండా.. ఈ సినిమా మంచి విజయాన్ని అందిస్తుంది అనే నమ్మకం ఉంది.

ప్ర) స్టార్ డైరెక్టర్లతో సినిమా చేసి మార్కెట్ పెంచుకోవాలి అనే ఆలోచన ఏమైనా ఉందా?

నాగ శౌర్య : నేను అనుకోవడం కాదండి. అది స్టార్ డైరెక్టర్ లు అనుకోవాలి. ‘పోకిరి’ ‘బాహుబలి’ ‘పుష్ప’ వంటి సినిమాలు హీరోల మార్కెట్లను పెంచాయి. ఇలా స్టార్ డైరెక్టర్లు అనుకుని నాతో సినిమా చేస్తాను అంటే నేను ఎప్పుడూ రెడీ. వాళ్ళు ఇబ్బంది పడుతూ మనతో సినిమా చేయకూడదు.

ప్ర) నటుడిగా, రచయిత గా, నిర్మాతగా సినిమాలు చేశారు. దర్శకత్వం చేయాలని ఉందా ?

నాగ శౌర్య : లేదండీ. ప్రస్తుతానికి ఆ ఆలోచన అయితే లేదు.

ప్ర) రంగబలి మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పండి?

నాగ శౌర్య : పవన్ సి హెచ్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు.’లవ్ స్టొరీ’ తర్వాత అతను మా సినిమాకి పనిచేసాడు. పాటలు, ఆర్ఆర్ రెండూ బాగా వచ్చాయి. థియేటర్ లో చాలా ఎంజాయ్ చేస్తారు.

ప్ర) మీ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి ?

నాగ శౌర్య : (Naga Shaurya) నా 24వ సినిమా షూటింగ్ మొదలైంది. టైటిల్ ఇంకా పెట్టలేదు. ఈ సినిమా రిలీజ్ తర్వాత రెండో షెడ్యుల్ మొదలుపెడతాం.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus