Naga Shaurya: అనుష్క గురించి నాగశౌర్య అలాంటి కామెంట్స్ చేశారా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి అనుష్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. తాజాగా ఈయన రంగ బలి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా స్పందన అందుకుంది.ఇక సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత సినీ సెలబ్రిటీల గురించి ఎన్నో రకాల వార్తలో వైరల్ అవుతుంటాయి.

ఇలా సెలబ్రిటీల గురించి వచ్చేటటువంటి ఈ వార్తలలో కొంతవరకు నిజం ఉన్నప్పటికీ మరికొన్ని అవాస్థవాలే అవుతూ ఉంటాయి. ఇలా తమ గురించి వస్తున్నటువంటి రూమర్లపై సెలబ్రిటీలు స్పందిస్తూ క్లారిటీ ఇస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా నాగశౌర్య అనుష్క గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అనుష్క గురించి నాగశౌర్య ఇలా అన్నారు అంటూ ఓ వార్త చెక్కర్లు కొడుతుంది.

ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి నాగశౌర్య (Naga Shaurya) నాకు అనుష్క అంటే చాలా ఇష్టం తనతో నాకు ఎఫైర్ ఉన్నట్లు ఒక వార్త రాయండి ప్లీజ్ అంటూ వేడుకున్నారని ఓ వార్త చెక్కర్లు కొడుతుంది.అసలు నాగశౌర్య అనుష్క గురించి ఇలా అనడానికి కారణం ఏంటి అనే విషయానికి వస్తే… నాగశౌర్య ఇదివరకు ఇండస్ట్రీలో పలువురు హీరోయిన్లతో అఫైర్స్ కొనసాగిస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇలా నాకు ఎంతో మంది హీరోయిన్లతో ఎఫైర్ ఉందంటూ వార్తలు రాశారు.

అయితే ఈసారి నేనే స్వయంగా అడుగుతున్నాను నాకు అనుష్క అంటే చాలా ఇష్టం తనతో కూడా నాకు ఎఫైర్ ఉందని వార్తలు రాయండి అంటూ ఈయన వేడుకున్నారని ఓ వార్త సంచలనగా మారింది.అయితే నాగశౌర్య తన గురించి వచ్చినటువంటి ఈ వార్తలన్నింటినీ ఖండిస్తూ ఇలాంటి కామెంట్స్ చేశారని అర్థమవుతుంది. ఇక ఈయనకు అనుష్క శెట్టి అంటే ఎంతో ఇష్టమని చెప్పారు. అయితే ఆమెను పెళ్లి చేసుకో లేకపోయినా అనూష శెట్టి అనే అమ్మాయిని మాత్రం పెళ్లి చేసుకొని జీవితంలో స్థిరపడ్డారు.

హిడింబ సినిమా రివ్యూ & రేటింగ్!

అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమా రివ్యూ & రేటింగ్!
హత్య సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus