‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్లో రూపొందిన ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar) ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj) సినిమాలకి నెట్ ఫ్లిక్స్ లో సూపర్ రెస్పాన్స్ వస్తుంది. పాన్ ఇండియా సినిమాల కంటే ఎక్కువ వ్యూయర్ షిప్ తో ఇవి ట్రెండింగ్లో నిలిచాయి. అయితే థియేట్రికల్ గా ఇవి ఆశించిన స్థాయిలో పెర్ఫార్మ్ చేయలేదు. ‘లక్కీ భాస్కర్’ గత ఏడాది అంటే అక్టోబర్ 31న దీపావళి కానుకగా రిలీజ్ అయ్యింది. సినిమాకి మంచి టాక్ వచ్చింది. ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ సినిమా బాగా కనెక్ట్ అయ్యింది.
కానీ ఆ సినిమా కంటెంట్ కి రావలసిన అప్రిసియేషన్.. భారీ కలెక్షన్స్ రాలేదు. ఏదో బ్రేక్ ఈవెన్ అయ్యిందంటే అయ్యింది అనుకోవాలి అంతే..! కానీ ఓటీటీలో వీటిని చూసి కచ్చితంగా ఇవి బ్లాక్ బస్టర్ ఫలితాలు అనుకోవాల్సిన సినిమాలు అని చాలా మంది భావిస్తున్నారు. దీనిపై నాగవంశీని (Suryadevara Naga Vamsi) ప్రశ్నించగా.. ఆయన ఈ రీతిగా స్పందించాడు. ” ‘లక్కీ భాస్కర్’ మేము కొత్తగా ట్రై చేశాము. దానికి కచ్చితంగా హిట్ రిజల్ట్ వస్తుంది అనుకున్నాం. కలెక్షన్స్ కూడా ఓకే మేము అనుకున్నట్టే వచ్చాయి.
పోటీగా ‘అమరన్’ ఉండటం వల్ల.. ఆ సినిమా కొంచెం ఎక్కువగా జనాలని ఆకర్షించింది. కానీ ‘లక్కీ భాస్కర్’ ఏమీ తగ్గలేదు. అలాగే సంక్రాంతికి బాలకృష్ణ (Nandamuri Balakrishna) గారితో చేసిన ‘డాకు మహారాజ్’ వచ్చింది. అది నేను ఎక్స్పెక్ట్ చేసినంత కలెక్ట్ చేయలేదు. కానీ అది కూడా ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టింది. బాలకృష్ణ గారు సినిమాలో ఇరక్కొట్టేశారు. ఆ సంతృప్తి మాకు దక్కింది. అప్పుడు కూడా దిల్ రాజు (Dil Raju) గారి ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) ఉండటం వల్ల మా సినిమా అండర్ పెర్ఫార్మ్ చేసింది” అంటూ చెప్పుకొచ్చాడు నాగవంశీ.