బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ (Anurag Kashyap) గురించి తెలుగు వాళ్లలో చాలా మందికి తెలిసే ఉండొచ్చు. హిందీలో ఇతను వైవిధ్యమైన సినిమాలు తీశాడు. ‘బ్లాక్ ఫ్రైడే’ ‘నో స్మోకింగ్’ ‘రిటర్న్ ఆఫ్ హనుమాన్’ ‘దేవ్ డి’ ‘గులాల్’ ‘ది గర్ల్ ఇన్ ఎల్లో బూట్స్’ ‘గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్’ ‘అగ్లీ’ ‘బాంబే వెల్వెట్’ ‘రామన్ రాఘవ్ 2.ఓ’ ‘ముక్క బాజ్’ ‘మన్మరియన్’ ‘చాకడ్’ ‘దోబారా’ ‘కెన్నెడీ’ వంటి సినిమాలు డైరెక్ట్ చేశాడు. ఇందులో ‘గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్’ అక్కడి జనాలను బాగా ఆకట్టుకుంది.
దీనికి కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. అయితే మీటు టైంలో ఇతని పేరు కూడా హైలెట్ అయ్యింది. ఎన్టీఆర్ (Jr NTR) ‘ఊసరవెల్లి’ (Oosaravelli) బ్యూటీ పాయల్ ఘోష్ (Payal Ghosh) ఇతనిపై Laiగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అటు తర్వాత అతను డైరెక్షన్ కి కూడా దూరంగా ఉంటూ వచ్చాడు. నటనపై ఫోకస్ పెట్టాడు. తమిళంలో ‘అంజలి సీబీఐ’ ‘మహారాజ’ (Maharaja) వంటి సినిమాల్లో విలన్ గా నటించి మెప్పించాడు.
కాకపోతే అనురాగ్ కశ్యప్ పై చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. అతని మూడ్ ఒక్కోసారి ఒక్కోలా ఉంటుందని. కారణం లేకుండా అతను సెట్స్ నుండి వెళ్ళిపోతాడని, తోటి నటీనటులతో కలవడు అని, అంతేకాకుండా దర్శకులను, నిర్మాతలని, హీరోలని కూడా లెక్కచేయడు అనే ఆరోపణలు ఇతనిపై ఉన్నాయి.
అలాంటి నటుడుని తెలుగులోకి తీసుకొస్తున్నాడు అడివి శేష్ (Adivi Sesh) . అతను హీరోగా రూపొందుతున్న ‘డెకాయిట్’ లో అనురాగ్ కశ్యప్ ఓ పోలీస్ పాత్ర పోషిస్తున్నాడు. అతను తెలుగులో కంటిన్యూ అయ్యేది లేనిదీ ఈ ఒక్క సినిమాతో తేలిపోతుంది అని కొందరు ఫిలిం సర్కిల్స్ లో చర్చించుకుంటున్నారు.