ఈ ఏడాది ఇప్పటివరకు విడుదలైన భారీ బడ్జెట్ సినిమా ఏదనే ప్రశ్నకు గుంటూరు కారం (Guntur Kaaram) సినిమా పేరు సమాధానంగా వినిపిస్తుంది. ఈ సినిమా ఫుల్ రన్ లో 200 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సాధించింది. మహేష్ (Mahesh Babu) త్రివిక్రమ్ (Trivikram) కాంబోలో సినిమా కావడం, సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ కావడం ఈ సినిమాకు ప్లస్ అయింది. అయితే ఈ సినిమా విషయంలో మాకేం బాధ లేదని బాధ అంతా మీడియాదే అని నాగవంశీ చెప్పుకొచ్చారు.
గుంటూరు కారం విషయంలో తాము సంతోషంగా ఉన్నామని ఆయన కామెంట్లు చేశారు. ఈ సినిమాను కొనుగోలు చేసిన బయ్యర్లు సైతం సంతోషంగా ఉన్నారని ఆయన వెల్లడించారు. గుంటూరు కారం విషయంలో మరోసారి నాగవంశీ క్లారిటీ ఇచ్చి ఈ సినిమా సూపర్ హిట్ అని తేల్చేశారు. టిల్లు స్క్వేర్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా నాగవంశీ (Suryadevara Naga Vamsi) ఈ విషయాలను వెల్లడించారు. గుడ్ ఫ్రైడే కానుకగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.
డీజే టిల్లు (DJ Tillu) సినిమాకు సీక్వెల్ కావడంతో ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమాకు టిల్లు స్క్వేర్ (Tillu Square) అనే టైటిల్ ను ఫిక్స్ చేశారని తెలుస్తోంది. టిల్లు స్క్వేర్ సినిమాలో అనుపమ పరమేశ్వరన్హీ(Anupama Parameswaran) రోయిన్ గా నటించారు. గత సినిమాలకు భిన్నంగా అనుపమ ఈ సినిమాలో గ్లామరస్ గా కనిపించడానికి ప్రాధాన్యత ఇవ్వడం గమనార్హం.
టిల్లు స్క్వేర్ సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరగగా ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సిద్ధు జొన్నలగడ్డ ఈ సినిమాతో కెరీర్ పరంగా మరింత ఎదగడంతో పాటు మార్కెట్ ను మరింత పెంచుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. డీజే టిల్లు సినిమాను మించి ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. ఇప్పటికే రిలీజైన టిల్లు స్క్వేర్ సినిమా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
షరతులు వర్తిస్తాయి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డెవిల్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?
‘బబుల్ గమ్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?