OG: ‘ఓజి’ టైటిల్ ఎన్టీఆర్ కోసం రిజిస్టర్ చేయించుకున్నాడా?

‘ఓజి’ టైటిల్ నిర్మాత నాగవంశీ ముందుగా రిజిస్టర్ చేయించుకుని పెట్టుకున్నారట. ఈ విషయాన్ని నిర్మాత డీవీవీ దానయ్య ఈరోజు జరిగిన ‘ఓజి’ సక్సెస్ మీట్లో బహిరంగంగానే వెల్లడించారు. అనుకోకుండా నాగవంశీ కూడా అక్కడే ఉండటంతో క్రెడిట్ ఇచ్చి థాంక్స్ చెప్పారు. అంతేకాదు నాగవంశీ ‘ఓజి’ ని సీడెడ్ లో డిస్ట్రిబ్యూట్ చేశారట. ఈ విషయాన్ని కూడా నిర్మాత దానయ్య బయట పెట్టడం జరిగింది. ‘ఓజి’ సినిమాలో హీరో పేరు ఓజాస్ గంభీర. షార్ట్ కట్లో ఓజి అనమాట.

OG

సినిమాకి అది యాప్ట్ టైటిల్. సుజిత్.. పవన్ కళ్యాణ్ కి, దానయ్యకి కథ చెప్పినప్పుడే.. టైటిల్ ‘ఓజి’ అయితే బాగుంటుంది అని చెప్పాడట. అయితే అప్పటికే నాగవంశీ ఆ టైటిల్ ను రిజిస్టర్ చేసి పెట్టుకున్నాడు. కానీ పవన్ కళ్యాణ్ సినిమా కోసం దానయ్య అడిగిన వెంటనే మరో మాట చెప్పకుండా ఇచ్చేశాడట. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కంట్రోల్ లో త్రివిక్రమ్ ఉంటారు. త్రివిక్రమ్ కంట్రోల్ లో నాగ వంశీ ఉంటారు కాబట్టి..!

ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే.. ‘నాగవంశీ ఏ హీరో కోసం ఆ టైటిల్ రిజిస్టర్ చేసి పెట్టుకున్నారు?’ అనే ప్రశ్న చాలా మందిని వెంటాడుతుంది. అందుకు సమాధానంగా ఎన్టీఆర్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. అవును నాగవంశీ ఎన్టీఆర్ కి వీరాభిమాని. అతనికి ఈ టైటిల్ బాగుంటుంది అని భావించి ముందుగానే రిజిస్టర్ చేయించి పెట్టుకున్నాడట. కానీ ఫైనల్ గా దానిని పవన్ కళ్యాణ్ కి ఇవ్వాల్సి వచ్చినట్లు తెలుస్తుంది.

ఆ సీన్ డిలీట్ చేయడం వల్ల ‘సుజీత్ మళ్ళీ దెబ్బేశాడు’ అని ట్వీట్లు వేసేశారు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus