Guntur Kaaram: ‘గుంటూరు కారం’ పై మళ్ళీ నాగవంశీ సెన్సేషనల్ కామెంట్స్..!

మహేష్ బాబు- త్రివిక్రమ్ కలయికలో ‘అతడు’ ‘ఖలేజా’ తర్వాత ‘గుంటూరు కారం’ అనే సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ బ్యానర్ పై రాధాకృష్ణ(చినబాబు) ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇది పక్కా మాస్ సినిమా. అలాగే క్లాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే కామెడీ అండ్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని వినికిడి. మహేష్ అభిమానులు ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. మహేష్ ఈ సినిమాలో కంప్లీట్ మాస్ లుక్ లో కనిపించబోతున్నాడు అనే విషయాన్ని తెలియజేస్తూ..

ఎప్పటికప్పుడు పోస్టర్స్ వదులుతూనే ఉన్నారు మేకర్స్. అవి అభిమానులను అమితంగా ఆకట్టుకున్నాయి. మొన్నామధ్య ఓ సందర్భంలో నాగవంశీ మాట్లాడుతూ..’ ఈసారి ‘గుంటూరు కారం’ తో రాజమౌళి రికార్డ్స్ కి దగ్గరగా వెళ్తాము’ అంటూ చెప్పి అంచనాలు పెంచేశాడు. అయితే తర్వాత ‘గుంటూరు కారం’ ప్రాజెక్టు విషయంలో ఊహించని మార్పులు చోటు చేసుకున్నాయి. హీరోయిన్ పూజా హెగ్డే తప్పుకోవడం.. శ్రీలీల మెయిన్ హీరోయిన్ అవ్వడం, కెమెరామెన్ కూడా తప్పుకోవడం జరిగింది.

కాబట్టి.. నాగ వంశీలో ఇంకా రాజమౌళి రికార్డ్స్ కొడతాం అనే కాన్ఫిడెన్స్ ఉందా? అని నిన్న ‘మ్యాడ్’ ప్రమోషన్స్ లో ఓ విలేకరి ప్రశ్నించడం జరిగింది. దానికి నాగవంశీ ‘ఇప్పటికీ అదే మాటకి కట్టుబడి ఉన్నాను. ‘గుంటూరు కారం’ తో (Guntur Kaaram) రాజమౌళి రికార్డ్స్ కి దగ్గరగా వెళతాం’ అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో అతని కామెంట్స్ మళ్ళీ హాట్ టాపిక్ అయ్యాయి.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus