ఆ రూ.8 లక్షల ప్రాపర్టీ తప్ప.. పవన్ కళ్యాణ్ కు ఆస్తులు ఏమీ లేవు : నాగబాబు

  • February 1, 2023 / 07:00 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీని బలోపేతం చేయడం కోసం అలాగే 2024 ఎన్నికల రీత్యా.. ఎక్కువ మీటింగ్ లకు హాజరవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పవన్ ఇచ్చే ప్రసంగాల్లో భాగంగా తన వద్ద డబ్బులు లేవని.. ఉన్న డబ్బుతో పార్టీ బిల్డింగ్ కట్టానని, కనీసం స్టాఫ్ కు జీతాలు ఇవ్వడానికి కూడా రూపాయి లేదు అని చెబుతుంటారు. ఇలాంటి కామెంట్ల పై అటు వైసీపీ నేతలు గానీ

ఇటు సినీ పరిశ్రమ నుండి తమ్మారెడ్డి భరద్వాజ్ వంటి వారు కూడా సెటైర్లు వేస్తున్న సందర్భాలను మనం చూస్తూనే ఉన్నాం. పవన్ కళ్యాణ్ ఆర్థిక పరిస్థితి గురించి తాజాగా నాగబాబు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు . నాగబాబు మాట్లాడుతూ.. “ప్రస్తుతం కళ్యాణ్ బాబు గడుపుతున్న జీవితం లోన్‌లతో కూడిన లగ్జరీ లైఫ్ లాంటిది. అతని వద్ద ఇప్పుడున్న కార్లు అయినా, తను ఉంటున్న ఇల్లు అయినా అన్ని బ్యాంకులు ఇచ్చిన లోన్‌ల పై ఉన్నవే.

ఇప్పటివరకు తనకంటూ సంపాదించుకుంది ఏమీ లేదు. ఇండస్ట్రీలో హైయెస్ట్ పెయిడ్ యాక్టర్ కళ్యాణ్ బాబు కానీ తనకి ఉన్న ఆస్తులు కంటే అప్పులు ఎక్కువ అంటే ఎవ్వరూ నమ్మరు. కానీ ఇది నిజం. పార్టీ పెట్టినప్పుడు కూడా డబ్బులు లేక పిల్లల ఫిక్స్డ్ డిపాజిట్ మనీ వాడేశాడు. తనకంటూ ఉన్న ఆస్తి ఏమన్నా ఉంది అంటే అది శంకర్ పల్లిలో ఉన్న ఫార్మ్ హౌస్ మాత్రమే.తనకు ఫార్మింగ్ చేయడం ఇష్టం. తన కెరీర్ ప్రారంభంలో దాన్ని రూ.8 లక్షలు పెట్టి కొనుక్కున్నాడు.

అయితే దాన్ని కూడా ఒక టైం లో అమ్మడానికి రెడీ అయిపోయాడు. నేనే అడ్డుపడ్డాను. ‘జానీ’ సినిమా ప్లాప్ అయిన తర్వాత డిస్ట్రిబ్యూటర్లను ఆదుకునేందుకు తన కలిగిన ఆస్తులన్నీ అమ్మేశాడు. ఆ క్రమంలోనే ఆ ఫార్మ్ హౌస్ కూడా అమ్మేయడానికి నిర్ణయం తీసుకున్నాడు. అప్పుడు నేను అడ్డుపడి నువ్వు ఈ ల్యాండ్ ని వ్యవసాయం చేయడానికి ఇష్టపడి కొనుకున్నావు. అంతేగాని డబ్బు సంపాదించడానికి కాదు కదా? అని చెబితే విని అది అమ్మకుండా ఉంచాడు. ప్రస్తుతం కళ్యాణ్ బాబుకు ఉన్న ఏకైక ఆస్తి అది ఒక్కటే” అంటూ నాగబాబు తెలియజేశాడు.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus