Nagababu: వర్మ మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా?

వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమాని విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈయన పట్ల పలువురు నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే నేడు విడుదల కావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల విడుదల ఆగిపోయింది అయితే ఈ సినిమా విడుదల అవుతున్నటువంటి తరుణంలో అమరావతి ఉద్యమ నేత కొలికపూడి శ్రీనివాసరావు చేసినటువంటి కామెంట్లు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి ఎవరైనా వర్మ తలనరికి తీసుకు వస్తే కోటి రూపాయలు ఇస్తానంటూ ఈయన కామెంట్లు చేశారు.

ఈ విధంగా వర్మ గురించి ఈయన ఇలాంటి కామెంట్లు చేయడంతో వెంటనే మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. వర్మపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పూర్తిగా తప్పు నేను కూడా ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్నాను వర్మ మీరేమీ భయపడకండి మిమ్మల్ని ఈ ఇండియాలో చంపే ఎదవ ఎవరూ లేరు ఎందుకంటే హీరో విలన్ కొట్లాడుతూ ఉంటే మధ్యలో కమెడియన్ ను చంపేయలేరు కదా మీరు కూడా కమెడియన్ లాంటి వారే అంటూ తన స్టైల్ లో వర్మపై నాగబాబు పోస్ట్ చేశారు.

ఈ విధంగా నాగబాబు వర్మ గురించి పోస్ట్ చేయడంతో వర్మ కూడా తన స్టైల్ లోనే కౌంటర్ ఇచ్చారు. సార్ నా పక్కన పెద్ద కమెడియన్ మీరే. నా సినిమాలో మీరు, మీ తమ్ముడి దగ్గర డబ్బులడుక్కుని టీ తాగి పడుకోండి అంటూ కౌంటర్ ఇవ్వగా నాగబాబు స్పందిస్తూ…వర్మ నా పోస్ట్ కు రిప్లై ఇచ్చినందుకు ధన్యవాదాలు . అలాగే కొంతవరకు షాక్ కి కూడా అయ్యాను ఎందుకంటే మీరు చనిపోయి 20 సంవత్సరాలు అవుతుందిగా అంటూ నాగబాబు (Nagababu) సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇంకా బతికున్నాను అనుకుని తిరుగుతున్నారు కానీ మీ ఆత్మ మాత్రమే తిరుగుతోంది అది గ్రహించాలి మీరు, Any how ఏదో ఓ రూపంలో మీరు నా ప్రశ్నకు సమాధానం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పటికీ మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. కీర్తిని కోల్పోయిన కీర్తిశేషులు వర్మ గారికి ఇదే నా ప్రగాఢ సానుభూతి అంటూ నాగబాబు కామెంట్ చేశారు మరి ఈ కామెంట్లపై వర్మ స్పందన ఎలా ఉంటుంది అనే విషయం తెలియాల్సి ఉంది.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus