Nagababu: నాగబాబు సెటైర్లు ఇప్పట్లో ఆగేలా లేవు!

మెగాబ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో వేసే పంచ్ లు, సెటైర్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మధ్యకాలంలో ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లలో ఫ్యాన్స్ తో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్ లో పాల్గొంటున్నారు నాగబాబు. అందులో అభిమానులు అడిగే ప్రశ్నలకు తన స్టైల్ లో సమాధానాలు ఇస్తున్నారు. ఈ క్రమంలో కొందరిపై నేరుగా కౌంటర్లు కూడా వేస్తున్నారు. కొందరిపై మాత్రం పరోక్షంగా సెటైర్లు వేస్తుంటారు. తాజాగా మరోసారి అభిమానులతో ముచ్చటించారు.

Click Here To Watch NOW

ఎక్కువగా రాజకీయాలకు సంబంధించిన ప్రశ్నలే ఎదురయ్యాయి. వైఎస్ జగన్, ఏపీ మంత్రులు, జనసేన, పవన్ కళ్యాణ్ లకు సంబంధించిన ప్రశ్నలే అడిగారు ఫ్యాన్స్. అయితే ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు వింతగా బదులిచ్చారు నాగబాబు. ‘ఆర్ఆర్ఆర్’ లేదా ‘కేజీఎఫ్’ అని ప్రశ్నించగా.. దానికి నాగబాబు.. ‘రెండూ కాదు.. రీసెంట్ గా వచ్చిన లెజెండరీ గ్రాఫిక్స్ సినిమా’ అని చెప్పారు. నాగబాబు పరోక్షంగా ‘సన్ ఆఫ్ ఇండియా’ సినిమా గురించే మాట్లాడారని అందరూ అనుకుంటున్నారు.

గతంలో కూడా ఇలానే ఫ్యాన్స్ తో ముచ్చటించినప్పుడు.. ఈ మధ్యే ఒక సినిమాకు వెళ్లాను.. ఇద్దరమే ఉన్నామంటూ కౌంటర్ వేశారు. మంచు ఫ్యామిలీను టార్గెట్ చేస్తూ నాగబాబు ఈ కామెంట్స్ చేస్తున్నారనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. ‘మా’ ఎలెక్షన్స్ మొదలైనప్పటి నుంచి మంచు ఫ్యామిలీతో నాగబాబుకి విబేధాలు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ ఆ వ్యవహారం వేడి మీదే ఉందనిపిస్తోంది. రీసెంట్ గా మంచు మనోజ్ హయ్యర్ పర్పస్ అంటూ నాగబాబుని టార్గెట్ చేశాడు. ఆ వ్యవహారం కూడా కొంతకాలం సాగింది. వీరంతా కలిసి మీమర్స్ కి మాత్రం మంచి కంటెంట్ ఇస్తున్నారనే చెప్పాలి!

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus