తమ్మారెడ్డి కామెంట్స్ కు ఓ రేంజ్లో ఫైర్ అయిన నాగబాబు

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత, దర్శకుడు అయిన తమ్మారెడ్డి భరద్వాజ ఇటీవల ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా టీం పై చేసిన కామెంట్స్ పెద్ద దుమారమే రేపాయి. ‘ఆర్.ఆర్.ఆర్’ లో ‘నాటు నాటు’ పాట ఆస్కార్ కు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో అందరూ తప్పకుండా ఈ పాటకు ఆస్కార్ రావాలని కోరుకుంటున్నారు. నిజంగా తెలుగువారందరూ గర్వపడాల్సిన సమయం ఇది. అయితే ఈ విషయాన్ని టాలీవుడ్లో చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు అని ఇటీవల తమ్మారెడ్డి చేసిన కామెంట్స్ తో స్పష్టమవుతుంది. ‘ ‘ఆర్.ఆర్.ఆర్’ కి ఆస్కార్ రావాలని టీం రూ.80 కోట్లు ఖర్చు చేసింది.

ఆ రూ.80 కోట్లతో మనం 8 సినిమాలు చేసేసి మొహాన కొట్టేవాళ్ళం. కేవలం వాళ్ళ ఫ్లైట్ టికెట్స్ కోసమే కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. మేము సమాజాన్ని మార్చాలని సినిమాలు చేయడం లేదు. మాకు నచ్చిన సినిమాలు చేస్తున్నాం.మేము సమాజాన్ని మార్చాలని చూస్తాం కానీ సమాజాన్ని ఉద్ధరించడానికి మేము పుట్టలేదు’ అంటూ ఆయన ఏంటేంటో కామెంట్లు చేశాడు. మొన్నామధ్య పవన్ కళ్యాణ్ పై కూడా తమ్మారెడ్డి ఇష్టమొచ్చినట్టు కామెంట్లు చేశాడు. పవన్ కళ్యాణ్ రూ.80 కోట్లు పారితోషికం తీసుకుంటాడని.. అలాంటి ఆయనకు అప్పులేంటని తమ్మారెడ్డి సెటైర్లు వేశాడు.

ఇక పవన్ రాజకీయాల గురించి, చిరంజీవి గురించి ఏదో సెటైర్ వేస్తూనే ఉన్నాడు తమ్మారెడ్డి. ఇప్పుడు ‘ఆర్.ఆర్.ఆర్’ పై తమ్మారెడ్డి సెటైర్లు వేయడంతో నాగబాబుకి ఛాన్స్ దొరికినట్టు అయ్యింది. అందుకే తమ్మారెడ్డి పై ఓ రేంజ్లో ఫైర్ అయ్యాడు నాగబాబు. ‘ఇప్పటివరకు మీరు రాజకీయాల గురించి చాలా విమర్శలు చేశారు. మేమెప్పుడూ కౌంటర్ ఇచ్చింది లేదు. మీ కెరీర్ మొత్తంలో మీరు ఎన్ని సినిమాలు తీశారు.

మీరు నిర్మించిన సినిమాల్లో నటించిన నటీనటులకు పారితోషికం సరిగ్గా ఇచ్చారా? ఎంతమందికి ఎగ్గొట్టారో ఇక్కడ అందరికీ తెలుసు. మీరు తీసిన సినిమాల్లో అవార్డుకు నామినేట్ అయ్యిందా? మీరు రిటైర్ అయిపోయి ఖాళీగా ఉండి ఏం మాట్లాడాలో తెలీక ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు.మన ముందు మైక్ పెట్టినంత మాత్రాన మనం మహానుభావులం కాదు. సినీ పరిశ్రమకు చెందిన మనిషయ్యుండి మీరు ఓ సినిమాకి గొప్ప పురస్కారం అందబోతుంటే ఇంత విషం కక్కుతారా? రూ.80 కోట్లు ఖర్చు పెట్టారు అంటున్నారు మీరేమైనా అకౌంట్స్ చూశారా?

మీరు నాటు నాటు స్టెప్ వేయగలరా? నిలబడితే మోకాళ్ళ నొప్పి మీకు.. ఆ స్టెప్ వేయడానికి ట్రై చేస్తే కాళ్ళు అలా ఇరుక్కుపోతాయి’ అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాడు నాగబాబు. అలాగే తన ట్విట్టర్లో కూడా “To Whomever It May Concern : “నీయమ్మ మొగుడు ఖర్చు పెట్టాడారా 80 కోట్లు R R R కి ఆస్కార్ కోసం”(#RRR మీద కామెంటుకు వై.సీ.పీ. వారి భాషలో సమాధానం) ” అంటూ తమ్మారెడ్డికి కౌంటర్ ఇచ్చాడు.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus