Bigg Boss Telugu 6: అసలు నిజం చెప్పిన నాగార్జున..! దీపావళి ఎపిసోడ్ లో జరిగింది ఇదే..!

బిగ్ బాస్ హౌస్ లో దీపావళి ఎపిసోడ్ ఫుల్ జోష్ తో జరిగింది. అందమైన హీరోయిన్స్ డ్యాన్స్ లు, శ్రీరామ్ చంద్ర పాటలు, ఆది పంచ్ లు , ఆఖర్లో కార్తీ మెరుపులతో ఎపిసోడ్ అద్దిరిపోయింది. ముఖ్యంగా దీపావళిరోజు హైపర్ ఆది వేసిన పంచ్ లు షోలోనే హైలెట్ గా నిలిచాయి. సైంటిస్ట్ వేషంలో వచ్చిన ఆది హౌస్ మేట్స్ అందరి గురించి సైటర్స్ వేస్తూ రెచ్చిపోయాడు. హౌస్ మేట్స్ కూడా ఆది చెప్పిన విషయాల్లోని నిజాలని గ్రహించారు. లాస్ట్ సీజన్ లో ఆది వేసిన పంచ్ లు ఇప్పటికీ ఆడియన్స్ కి గుర్తున్నాయి అంటే బిగ్ బాస్ లో హైపర్ ఆదికోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో అర్ధం అవుతోంది.

ఇక దీపావళి ప్రత్యేకమైన ఎపిసోడ్ ప్రారంభం అవ్వగానే బాలాదిత్య , రేవంత్ బిగ్ బాస్ పై ఒక పాట రాసి పాడారు. హౌస్ మేట్స్ ఎలా ఉంటారు, ఎలా ప్రవరిస్తారు అనేది పాటగా మార్చి పాడారు. ఆ తర్వాత హౌస్ మేట్స్ తో గేమ్స్ ఆడించాడు కింగ్ నాగార్జున. ఒకరికొకరు ట్యాగ్స్ ఇచ్చుకున్నారు. అసలు కథ దీని తర్వాతే అయ్యింది. గతవారం బిగ్ బాస్ హౌస్ లో ఫుడ్ షేర్ చేసుకున్న పాపానికి గీతు, ఆదిరెడ్డి అంట్లు తోమారు. అయితే, గీతుతో రేవంత్ కూడా ఫుడ్ షేర్ చేసుకున్న నిజాన్ని నాగార్జున బయటపెట్టాడు.

దీంతో హౌస్ మేట్స్ షాక్ అయ్యారు. హౌస్ మేట్స్ మాత్రమే కాదు, ఆడియన్స్ కి కూడా ఈవిషయం తెలీదు. ఎందుకంటే, లైవ్ లో కుడా ఇది చూపించలేదు. హాట్ స్టార్ లో 24గంటలు లైవ్ స్ట్రీమింగ్ లో కూడా ఈ క్లిప్పింగ్ లేదని కామెంట్స్ చేస్తున్నారు. అయితే, లైవ్ కూడా ఒకరోజు లేట్ గా టెలికాస్ట్ చేస్తారన్న విషయం చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. ఆదివారం జరిగింది సోమవారం, సోమవారం జరిగింది మంగళ వారం ఎడిటింగ్ చేసి మరీ స్ట్రీమింగ్ చేస్తారు. అయితే, టెలికాస్ట్ కంటే కూడా ఎక్కువ కంటెంట్ చూసేందుకు ప్రేక్షకులకి వీలుంటుంది.

బిగ్ బాస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ 24గంటలు పాటు ఏ పాయింట్ మిస్ అవ్వకుండా ఉంటుందని అనుకుంటారు చాలామంది. కానీ, అది కూడా ఎడిటింగ్ చేసి లైవ్ ఇస్తారని చాలామందికి తెలీదు. ఇక ఈ క్లిప్పింగ్ లేకపోయేసరికి ఆడియన్స్ మేము మిస్ అయ్యాం అనే ఫీలింగ్ కలిగింది. ఇక రేవంత్ కూడా గీతుతో ఫుడ్ షేర్ చేస్కున్నందుకు హోస్ట్ నాగార్జున ఈవారం గిన్నెలు మొత్తం తోమమని పనిష్మెంట్ ఇచ్చాడు. ఇక దీపావళి సంబరాల్లో హీరోయిన్స్ డ్యాన్స్ లతో హోరెత్తిపోయింది.

హీరోయిన్ అంజలి, అవికాగోర్, యాంకర్ రేష్మి డ్యాన్స్ లు ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచాయి. అలాగే, ఆఖర్లో హీరో కార్తీ వచ్చి స్టేజ్ పైన సందడి చేశాడు. సర్దార్ మూవీని ప్రమోట్ చేస్తూ, హౌస్ మేట్స్ ని పలకరించాడు. కార్తీని చూసిన హౌస్ మేట్స్ ఉత్సాహంతో గెంతులు వేశారు. అంతేకాదు, కార్తీ ఉన్నంతసేపు గేమ్ ఆడుతూ , డ్యాన్స్ చేస్తూ రెచ్చిపోయారు హౌస్ మేట్స్. దీపావళి స్పెషల్ ఎపిసోడ్ లో హైపర్ ఆది పంచ్ లు తర్వాత, కార్తీ రావడమే హైలెట్ అయ్యింది. అదీ మేటర్.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus