Nagarjuna, Chiranjeevi: నాగార్జున 100వ సినిమా కథపై ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

అక్కినేని నాగార్జున ‘నా సామి రంగ’ తో హిట్టు కొట్టి ఫామ్లోకి వచ్చారు. సంక్రాంతి కానుకగా జనవరి 14 న రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షోతోనే పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. దీంతో సంక్రాంతి సీజన్ కూడా కలిసొచ్చి బ్రేక్ ఈవెన్ సాధించింది. దీనికి ముందు నాగార్జున నటించిన సినిమాల్లో ‘బంగార్రాజు’ మినహా ఏదీ సక్సెస్ కాలేదు. నాగార్జున సినిమాలు సంక్రాంతి టైంలోనే విజయం సాధిస్తున్నాయి అన్ని భావించే వారి సంఖ్య కూడా పెరిగింది.

దీంతో నాగార్జున ఇక నుండి ప్రతి సంక్రాంతికి ఓ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అనే ఆలోచనకి వచ్చేసినట్టు స్పష్టమవుతుంది. ప్రస్తుతం నాగార్జున… శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న మూవీలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.దీని తర్వాత ‘బంగార్రాజు’ దర్శకుడు కళ్యాణ్ కృష్ణతో ఓ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ఇది కూడా గోదావరి జిల్లాల నేపథ్యంలో సాగే కథ అని ఇన్సైడ్ టాక్.

అంతేకాదు ఈ కథ కూడా చిరంజీవి వద్దకి వెళ్లి తిరిగి నాగార్జున వద్దకి వచ్చినట్టు సమాచారం. కళ్యాణ్ కృష్ణ.. చిరంజీవి కోసం ఓ కథ రెడీ చేసి వినిపించారు. కానీ ఆ కథని పక్కన పెట్టి.. ఓ సూపర్ హిట్ రీమేక్ కోసం కళ్యాణ్ కృష్ణని డైరెక్టర్ గా ఎంపిక చేసుకున్నారు. చిరు పెద్ద కుమార్తె సుస్మిత ఆ ప్రాజెక్టుని నిర్మించాలి.

అయితే ఈ ప్రాజెక్టు డిలే అవుతుంది. ఈ క్రమంలో ‘ఖాళీగా ఉండటం ఎందుకు’ అని భావించి చిరు కోసం అనుకున్న కథని నాగార్జునతో చేయడానికి దర్శకుడు కళ్యాణ్ కృష్ణ రెడీ అయ్యారట. నాగార్జున (Nagarjuna) కూడా అతని కథకు ఓకే చెప్పినట్లు తెలుస్తుంది.

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus