యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారి హోస్ట్ గా వ్యవహరిస్తోన్న బిగ్ బాస్ తెలుగు సీజన్ వన్ షో టెలివిజన్ రికార్డులన్నింటికీ రిపేర్లు చేస్తోంది. టెలివిజన్ రేటింగ్ పాయింట్ లోను, టెలివిజన్ వీవర్స్ పాయింట్ లోను అత్యధిక పాయింట్స్ రాబట్టి ముందుస్థాయిలో దూసుకుపోతోంది. ఈ సీజన్ రేపటితో ముగియనుంది. ‘బిగ్ బాస్’ ఫైనల్ ఎపిసోడ్ ను చాలా స్పెషల్ గా ఉండేలా స్టార్ మా టీమ్ ప్లాన్ చేస్తోంది. రేపు ప్రసారం కాబోయే ఈ ఫైనల్ ఎపిసోడ్ ఏకధాటిగా నాలుగు గంటలపాటు ప్రసారం కానుంది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నాగార్జున, దేవీశ్రీప్రసాద్ లు హాజరుకానున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ ఆట పాటలతో అలరించనుండగా, ఈ సీజన్ విన్నర్ కి నాగార్జున బహుమతిని ప్రదానం చేయనున్నారు. అలాగే ఇతర పార్టిసిపెంట్స్ కామెడీ స్కిట్స్ తో నవ్విస్తారని సమాచారం. మొత్తానికి రేపు బుల్లితెర ప్రేక్షకులకు నాలుగు గంటలపాటు నాన్ స్టాప్ వినోదాన్ని పొందనున్నారు.