ఖరారు అయిన వర్మ, నాగార్జున సినిమా రిలీజ్ తేదీ

తెలుగు చిత్ర పరిశ్రమను మలుపుతిప్పిన చిత్రం శివ. రామ్ గోపాల్ వర్మ తీసిన ఈ మూవీ నాగార్జున ట్యాలెంట్ ని బయటపెట్టింది. మంచి పేరు తెచ్చిపెట్టింది. వారి కాంబినేషన్లో కొత్త సినిమా గత ఏడాది నవంబర్ 20వ తేదీన అన్నపూర్ణ స్టూడియోస్‌లో షూటింగ్ ప్రారంభమైంది. ఈ మూవీ చిత్రీకరణ చాలా వేగంగా సాగుతోంది. భారీ అంచనాలు నెలకొని ఉన్న ఈ సినిమాకి “గన్”, “సిస్టమ్‌” అనే పేర్లు పరిశీలిస్తున్నట్లు గతంలో చక్కర్లు కొట్టాయి. తాజాగా అవి నిజం కావని స్పష్టమైంది. కొత్త నటి మైరా సరీన్‌ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్తానికి “ఆఫీసర్” అనే టైటిల్ ను ఖరారు చేశారు.

ఈ రోజు మీడియా సమావేశంలో ఈ పేరు తో పాటు మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఇందులో గన్ గురిపెట్టిన పోలీస్ గా నాగ్ అదరగొట్టారు. అంతేకాదు విడుదల తేదీని కూడా ప్రకటించారు. నాగార్జున ఆఫీసర్ గా మే 25 న థియేటర్లోకి రానున్నారు. వర్మ స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ చిత్రంతో వర్మ హిట్ ట్రాక్ లోకి రావచ్చని అంచనా వేస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus