మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున స్నేహితులనే సంగతి తెలిసిందే. సినిమాల విషయంలో, ఇతర విషయాల గురించి ఒకరితో మరొకరు చర్చించుకుంటారు. ఈరోజు మెగాస్టార్ చిరంజీవి సీఎం జగన్ ను ఏపీ టికెట్ రేట్ల తగ్గింపు గురించి, ఇతర ఇండస్ట్రీ సమస్యల గురించి చర్చించడానికి కలిశారు. చిరంజీవి, నాగార్జున కలిసి జగన్ ను కలిసి ఉంటే బాగుండేదని కామెంట్లు వినిపిస్తున్న నేపథ్యంలో నాగ్ స్పందించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి సినిమా ఇండస్ట్రీ తరపున జగన్ తో మాట్లాడటానికి వెళ్లారని నాగ్ అన్నారు.
బంగార్రాజు ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ముచ్చటిస్తూ నాగార్జున ఈ కామెంట్లు చేశారు. సినిమా రంగంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల గురించి తనకు చిరంజీవికి మధ్య చర్చ జరుగుతుందని నాగార్జున వెల్లడించారు. చిరంజీవి వారం రోజుల క్రితం ఫోన్ లో జగన్ ను కలుస్తున్నానని చెప్పారని నాగార్జున చెప్పుకొచ్చారు. నన్ను కూడా జగన్ ను కలవడానికి రావాలని చిరంజీవి కోరారని అయితే బంగార్రాజు ప్రమోషన్స్ లో బిజీగా ఉండటంతో కుదరలేదని నాగ్ కామెంట్లు చేశారు.
అంతా మంచే జరుగుతుందని చిరంజీవికి జగన్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని నాగార్జున చెప్పుకొచ్చారు. 2021 సంవత్సరం ఏప్రిల్ లో విడుదలైన టికెట్ రేట్ల జీవోకు సరిపోయే బడ్జెట్ తోనే బంగార్రాజు తెరకెక్కిందని నాగ్ అన్నారు. ఏపీలో అమలవుతున్న టికెట్ రేట్లు బంగార్రాజుకు వర్కౌట్ అయినా మరికొన్ని సినిమాలకు వర్కౌట్ కాకపోవచ్చని నాగార్జున కామెంట్లు చేశారు. సినిమా ఫ్లాప్ అయితే మాత్రం చేసేదేమీ ఉండదని నాగ్ అన్నారు. టికెట్ రేట్ల వల్ల సినిమా రిలీజ్ ను వాయిదా వేయడం మాత్రం సాధ్యం కాదని నాగ్ కామెంట్లు చేశారు.
రెండేళ్ల పాటు సినిమా లేకుండా ఇంటికి పరిమితమయ్యానని నాగ్ చెప్పుకొచ్చారు. నాగార్జున వేర్వేరు అంశాల గురించి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బంగార్రాజు సినిమాతో నాగ్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Most Recommended Video
ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!