అక్కినేని నాగార్జున, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన నాలుగోవ భక్తి చిత్రం “ఓం నమో వెంకటేశాయ” ఈరోజు విడుదలై సక్సస్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో చిత్ర బృందం చాలా సంతోషంగా ఉంది. అందరూ ఒకే దారిలో వెళ్తుంటే డిఫరెంట్ దారిలో ప్రయాణించి విజయాన్ని అందుకోవడం నాగార్జునకు శివ చిత్రం నుంచి అలవాటు. అలాగే ప్రయోగాలకు ముందుంటారు. విలక్షణ కథతో చేసిన గగనం, ఊపిరి వంటి ఫిలిమ్స్ ఆయనకు మంచి పేరును తెచ్చిపెట్టాయి. ఒక స్టార్ హీరో అయి ఉండి ఊపిరి చిత్రంలో మరో యువ నటుడితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. గతంలోనూ యువహీరోల సినిమాలో నటించి మల్టీ స్టారర్ మూవీలు చేయడానికి తాను సిద్ధమేనని చాటారు. యువహీరోలతో కాకుండా తోటి స్టార్ హీరోలయిన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్ లతో మల్టీస్టారర్ చేస్తారా? అనే ప్రశ్నను ఓ ఇంటర్వ్యూలో ఆయన ముందు ఉంచగా మనసులోని మాటను బయటపెట్టారు.
‘‘మల్టీస్టారర్లకు నేనెప్పుడూ సిద్ధమే. అప్పుడే కొత్త కొత్త కథలు వస్తాయి. మార్కెట్ పరిధి విస్తరిస్తుంది. నాతోటి నటులు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్… ఇలా ఎవరితోనైనా కలసి నటిస్తా. కానీ.. ఇద్దరి పాత్రలూ సమానంగా ఉన్నప్పుడే మల్టీస్టారర్ సినిమాలు బాగుంటాయి. ఒకరి పాత్ర ఎక్కువగా, ఇంకొకరి పాత్ర తక్కువగా ఉంటే అభిమానులు జీర్ణించుకోలేరు. నాకొచ్చే సినిమాలు నాకొస్తున్నప్పుడు నా పాత్ర తగ్గించుకొని, మల్టీస్టారర్లలో నటించడం వల్ల ఉపయోగం లేదు’’ అని నిర్మొహమాటంగా చెప్పారు. సో నాగ్ రెడీ నే, దర్శకులే అందుకు తగ్గ కథలు తీసుకువెళ్లాలి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.