వర్మ, పవన్ మధ్య గొడవను చల్లార్చనున్న నాగార్జున.!

  • April 21, 2018 / 05:01 AM IST

డైరక్టర్ రామ్ గోపాల్ వర్మ అనేక విషయాల్లో తలదూర్చారు. తనకి సంబంధం లేని అంశాలపై ట్వీట్స్ చేసి పోలీసుల చుట్టూ తిరిగిన సందర్భాలున్నాయి. అయినా అతను మారలేదు. క్యాస్టింగ్ కౌచ్ అనే అంశంపై పోరాడుతున్న శ్రీ రెడ్డిని రెచ్చగొట్టి పవన్ ని, అతని తల్లిని అనకూడని మాటలను అనిపించారు. పైగా అలా తిట్టామని చెప్పింది తానే అంటూ వర్మ చెప్పుకొని వివాదాల్లో చిక్కుకున్నారు. మెగా ఫ్యామిలీకి ప్రధాన శత్రువు అయ్యారు. పవన్ అయితే శ్రీ రెడ్డి, వర్మలపై యాక్షన్ తీసుకునే వరకు ఫిలిం ఛాంబర్‌ నుంచి కదలనని ఈరోజు నిరసన తెలిపారు. అభిమానులు పోటెత్తడంతో పోలీసుల కోరికమేరకు పవన్ వెళ్లిపోయారు.

అయితే ఈ గొడవకి ఫుల్ స్టాప్ పెట్టాలని నాగార్జున భావిస్తున్నట్లు సమాచారం. వర్మ దర్శకత్వంలో నాగార్జున ఆఫీసర్ సినిమా చేశారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. వచ్చే నెల రిలీజ్ కానుంది. వర్మ సొంతంగా నిర్మించిన ఈ మూవీపై ఈ గొడవ ప్రభావం తీవ్రంగా పడనుంది. అందుకే నాగ్ రంగంలోకి దిగారు. నాగార్జున మాటని వర్మ వింటారు. గతంలో అఖిల్ పై వర్మ ట్వీట్ చేయగా నాగ్ నుంచి కాల్ రాగానే డిలీట్ చేశారు. ఇప్పుడు కూడా నాగార్జున వర్మకి ఫోన్ చేశారని.. ఈ రోజు రాత్రికి హైదరాబాద్ కి వర్మ రానున్నట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. రేపటి లోపున ఈ సమస్య ముగిసిపోనుందని భావిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus