Nagarjuna,Mohan Raja: నాగార్జున మోహన్ రాజా కాంబోలో సినిమా తెరకెక్కనుందా?

చిరంజీవి మోహన్ రాజా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా రిజల్ట్ కోసం నాగ్ మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమా దర్శకుడు మోహన్ రాజా ఇప్పటికే నాగార్జునకు ఒక కథ చెప్పారని నాగార్జునకు ఆ కథ నచ్చినా గాడ్ ఫాదర్ రిజల్ట్ ను బట్టి నిర్ణయం తీసుకోవాలని నాగార్జున ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది.
గాడ్ ఫాదర్ సక్సెస్ సాధిస్తే నాగ్ మోహన్ రాజా కాంబో మూవీకి సంబంధించి

అధికారిక ప్రకటన వెలువడే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ప్రతి హీరోకు వందో సినిమా కీలకమనే సంగతి తెలిసిందే. స్టార్ హీరోలు తమ వందో సినిమా కచ్చితంగా సక్సెస్ సాధించే విధంగా జాగ్రత్తలు తీసుకుంటారనే సంగతి తెలిసిందే. నాగార్జున తన వందో సినిమా బాధ్యతలను మోహన్ రాజాకు అప్పగించాలని భావిస్తున్నట్టు బోగట్టా. మరోవైపు గాడ్ ఫాదర్ ది ఘోస్ట్ సినిమాలు ఒకేరోజున థియేటర్లలో రిలీజ్ కానుండటంతో చిరంజీవి అభిమానులు గాడ్ ఫాదర్ సినిమా కోసం నాగార్జున అభిమానులు ది ఘోస్ట్ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.

ఈ రెండు సినిమాలతో పాటు స్వాతిముత్యం సినిమా కూడా థియేటర్లలో రిలీజవుతోంది. స్వాతిముత్యం సినిమాకు మాత్రం బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేవు. గాడ్ ఫాదర్ సినిమాకు బుకింగ్స్ భారీ రేంజ్ లో ఉన్నాయి. ది ఘోస్ట్ సినిమాకు మాత్రం బుకింగ్స్ యావరేజ్ గా ఉన్నాయి. తొలిరోజు ఈ మూడు సినిమాలకు వచ్చే టాక్ ను బట్టి బుకింగ్స్ విషయంలో మార్పులు జరిగే ఛాన్స్ అయితే ఉంది.

దసరా విన్నర్ ఏ సినిమానో పూర్తిస్థాయిలో క్లారిటీ రావాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే. దసరా సినిమాలు కనీసం 200 కోట్ల రూపాయల రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకుంటాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

పోన్నియన్ సెల్వన్: 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus