Bigg Boss 7 Telugu: షాక్ అయిన సందీప్… నాగార్జున చెప్పిన రూల్స్ కి అర్ధం ఇదే..!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో ఫస్ట్ కంటెస్టెంట్ కన్ఫార్మ్ అయినట్లుగా కింగ్ నాగార్జున సందీప్ ని డిక్లేర్ చేశాడు. అంతేకాదు, పవర్ అస్త్రాన్ని సాధించి 5 వారాలు ఫస్ట్ టైమ్ బిగ్ బాస్ చరిత్రలోనే నిలిచాడని చెప్పాడు. దీంతో సందీప్ ఈ అవార్డ్ ని తన కొడుక్కి డెడికేట్ చేస్తున్నానని చెప్పడం తో నాగార్జున ట్విస్ట్ ఇచ్చాడు. ఇలా ఎవరికైనా డెడికేట్ చేస్తే ఆ పవర్ పోతుందని, దానికి సంబంధించిన బెనిఫిట్స్ కూడా అన్నీ పోతాయని ఆలోచించుకోమని చెప్పాడు. అయినా సరే మాస్టర్ సందీప్ దానిని తన కొడుక్కి ఇస్తానని ఇదే తన బర్త్ డే కి మంచి గిఫ్ట్ అవుతుందని చెప్పాడు. పవర్ అస్త్రాకి పవర్ పోయినా పర్లేదని చెప్పేసరికి, నాగార్జునతో పాటుగా ఆడియన్స్ కూడా ఇంప్రెస్ అయ్యారు.

ఇదంతా ఊరికే చెప్పానని, నీ క్యారెక్టర్ ఎలా ఉందో ప్రజలకి తెలియాలని నాగార్జున చెప్పేసరికి ఊపిరి పీల్చుకున్నాడు. ఇక పవర్ అస్త్రాన్ని తేలిగ్గా చూడద్దని దానికి ఎన్నో పవర్స్ ఉంటాయని అది బిగ్ బాస్ ఎప్పటికప్పుడు మీకు చెప్తాడని అన్నాడు. పవర్ అస్త్రాని ఉపయోగించి విఐపి రూమ్ ని ఎంజాయ్ చేయమని చెప్పాడు. అలాగే, దీంతో ఐదువారాల ఇమ్యూనిటీ వస్తుందని, ఈ 5 వారాలు నువ్వు నామినేషన్స్ నుంచీ సేఫ్ అవుతావని అన్నాడు నాగార్జున. ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు.

పవర్ అస్త్రాకి సంబంధించిన ఒక బ్యాటరీ ఇంట్లో ఉంటుందని, అది ఎప్పుడూ గ్రీన్ లో ఉంటే నీకు ఆ అస్త్రంలోని పవర్స్ వస్తాయని, నీ ఆట తీరుని బట్టీ ఛార్జింగ్ తగ్గుతుందని, ఇంట్లో నువ్వు తప్పులు చేసినా, లేదా రూల్స్ కి ఎగైనిస్ట్ గా చేసినా ఛార్జింగ్ తగ్గిపోతుందని హెచ్చరించాడు నాగార్జున. అంతేకాదు, పవర్ అస్త్రం లో రెడ్ లైడ్ వెలిగి ఛార్జింగ్ “లో” అయితే మాత్రం నీకు ఉన్న 5 వారాలు ఇమ్యూనిటీ కూడా ఎగిరిపోతుందని చెప్పాడు. దీంతో సందీప్ ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. దీన్ని కాపాడుకునే బాధ్యత నీదే అని చెప్పాడు హోస్ట్ నాగార్జున. దీంతో సందీప్ ఇప్పుడు ఈ పవర్ అస్త్రాన్ని ఎలా కాపాడుకుంటాడు అనేది ఆసక్తికరంగా మారింది. ఇక మిగతా హౌస్ మేట్స్ కూడా కన్ఫర్మేషన్ కోసం పోటీపడాల్సి ఉంటుంది.

హౌస్ లో సండే ఎపిసోడ్ అయిపోగానే నామినేషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఒక్కొక్కరు ఇద్దరిని నామినేట్ చేస్తూ సరైన రీజన్స్ చెప్పమని చెప్పాడు బిగ్ బాస్. ఈ రెండోవారం నామినేషన్స్ లో శివాజీ ఫుల్ ఫైర్ అయినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు, పవర్ అస్త్రాన్ని ఉపయోగించి సందీప్ ని నేరుగా ఒకరిని నామినేట్ చేయమని చెప్పాడు బిగ్ బాస్. మరి సందీప్ ఎవర్ని నామినేట్ చేస్తాడు అనేది చూడాలి.

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus