Nagarjuna: సమంత నాగచైతన్య విడిపోవడానికి నాగార్జున కూడా కారణమా?

సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోయి మూడు సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా వీరి విడాకుల గురించి ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. ప్రేమించి ఎంతో ఇష్టంతో పెళ్లి చేసుకున్నటువంటి వీరిద్దరూ విడిపోవడానికి సరైన కారణాలు తెలియకపోయినా వీరి విడాకుల గురించి ఏదో ఒక వార్త తరచూ వైరల్ అవుతూనే ఉంది. తాజాగా సమంత నాగచైతన్య విడిపోవడానికి పరోక్షంగా నాగార్జున కూడా కారణమంటూ ఒక వార్త వినపడుతుంది

సమంత నాగచైతన్య పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లల గురించి ఏమాత్రం ఆలోచించలేదు వీరిద్దరు పూర్తిగా వారి కెరియర్ పైన ఫోకస్ చేశారు అయితే ఇలాంటి సలహా ఇచ్చినది నాగార్జున అనే విషయం తెలియడంతో అందరూ షాక్ అవుతున్నారు. పెళ్లి తర్వాత సమంత నాగచైతన్యకు నాగార్జున సలహా ఇస్తూ ముందు మీ కెరియర్ పై ఫోకస్ పెట్టండి లైఫ్ లో మంచిగా సెటిల్ అయిన తర్వాత పిల్లల గురించి ఆలోచించండి అని చెప్పారట.

ఇక సమంత నాగచైతన్య కూడా లైఫ్ లో మంచిగా సెటిల్ అయిన తర్వాత పిల్లలను ప్లాన్ చేయాలని భావించారు. ఈ క్రమంలోని వీరిద్దరూ కూడా తమ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు అయితే సినిమాల కారణంగానే ఇద్దరు మధ్య కూడా మనస్పర్ధలు వచ్చాయని తెలుస్తోంది. ఇలా వీరిద్దరి మధ్య పలు మనస్పర్ధలు రావడంతో ఇద్దరూ విడాకులు తీసుకొని విడిపోవడమే మంచిదని నిర్ణయించుకున్నారు.

ఒకవేళ నాగార్జున (Nagarjuna)  అలా చెప్పకపోయి ఉంటే బహుశా వీరు తొందరగానే పిల్లలను ప్లాన్ చేసుకునే వారేమో పిల్లలు ఉంటే సమంత నాగచైతన్య విడిపోయేవారు కూడా కాదని పలువురు ఈ వార్తలపై స్పందిస్తూ కామెంట్లు చేయడమే కాకుండా పరోక్షంగా వీరి విడాకులకు నాగార్జున కూడా కారణమయ్యారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus